అసెంబ్లీకి చంద్రబాబు - రాజకీయ ఉత్కంఠ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తరువాత అసెంబ్లీకి వస్తున్నారు. నేటి పరిణామాలపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ విరామం తరువాత అసెంబ్లీకి వస్తున్నారు. కొంత కాలంగా అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు బహిష్కరించారు. తిరిగి సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసారు. సమావేశాలకు దూరంగా ఉంటున్న చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేకు మాత్రం వ్యూహాలు.. ఎప్పుడు ఎలా వ్యవహరించాలో దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికను అటు సీఎం జగన్ - టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అసెంబ్లీకి రానున్నారు.
ఒక్క ఓటు దూరంలో టీడీపీ
ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ ప్రాంగణలో మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనున్నారు. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎనిమిది మంది అభ్యర్దులు పోటీ పడుతున్నారు. తొలుత వైసీపీ నుంచి ఏడుగురు అభ్యర్దులు నామినేషన్లు దాఖలు చేయటంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమని అందరూ భావించారు. సడన్ గా చంద్రబాబు వ్యూహం మార్చారు. పార్టీ నుంచి పంచుమర్తి అనురాధను ఎన్నికల బరిలో దించారు. ఏడుగురు అభ్యర్దులు గెలవాలంటే ఒక్కోక్కరికి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అందులో భాగంగా వైసీపీకి తాజా సమీకరణాలతో 154 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిగ్గా సరిపోతోంది. టీడీపీకి 21 మంది మద్దతు కనిపిస్తోంది. ఒక్క ఓటు పెంచుకొనేందుకు టీడీపీ చివరి వరకు ప్రయత్నించింది.

అసెంబ్లీకి చంద్రబాబు..పర్యవేక్షణ
చంద్రబాబు అసెంబ్లీకి రానున్నారు. సమావేశాలను చంద్రబాబు బహిష్కరించిన తరువాత చివరి సారిగా రాష్ట్రపతి..ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ కోసం రానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో ప్రస్తుతం చంద్రబాబు సమావేశం అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఫలితం ఎలా ఉన్నా..అధికార పక్షానికి చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టేటమే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. అనూహ్యంగా ద్వితీయ ప్రాధాన్యత ఓటు గురించి చర్చ తీసుకొస్తున్నారు. కానీ, ప్రస్తుతం అభ్యర్దుల లెక్కలతో ప్రాధాన్యత అంశం వచ్చే అవకాశం కనిపించటం లేదు. ఈ క్రమంలో రెండు పార్టీలు మైండ్ గేమ్ తీవ్రతరం చేసాయి.

రెండు పార్టీల మైండ్ గేమ్
వైసీపీ ఎన్నికల నోటిఫికేషన్ సమయం నుంచి ఏడు స్థానాలు తమకే దక్కుతాయనే ధీమాతో ఉంది. వైసీపీ బలం సభలో 151గా ఉంది. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు, జనసేన ఎమ్మెల్యే వైసీపీకి మద్దతుగా ఉన్నారు. దీంతో..వైసీపీ బలం 156కి చేరింది. ఇద్దరు ఆనం..కోటంరెడ్డి దూరం అయ్యారు. ఈ లెక్కలతో ప్రస్తుతం వైసీపీ బలం 154గా ఉంది. ఇదే ఎప్పుడు ఏడుగురు అభ్యర్దులు గెలవటానికి కావాల్సిన నెంబర్. అదే సమయంలో టీడీపీ నుంచి 23 సంఖ్య బలం ఉండగా..నలుగురు వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీ నుంచి ఇద్దరు టీడీపీకి మద్దతుగా కనిపిస్తున్నారు. దీంతో టీడీపీ బలం 21గా ఉంది. మరో ఓటు కలిసి వస్తే టీడీపీ అనుకన్నట్లుగా వైసీపీకి షాక్ ఇవ్వగలుగుతుంది. ఈ మేరకు నాలుగు రోజులుగా రెండు పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు రకాలు ప్రచారాలు తెర పైకి వచ్చాయి. నేడు జరుగుతున్న ఎన్నికలో రెబల్స్ ఓటింగ్ కీలకంగా మారనుంది.
-
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications