ఏపీ ప్రజలను అలర్ట్ చేసిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ప్రజల్ని అలర్ట్ చేశారు. ఈనెల 21వ తేదీ నుంచి నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం జరగనుందని గుర్తుచేస్తూ ట్వీట్ చేశారు. ఇంటింటికీ వచ్చి వెరిఫికేషన్ చేపడతారని, ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. ఓటు లేకపోతే తక్షణమే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. చెక్ యువర్ ఓట్.. గెట్ యువర్ ఓట్ అంటూ ట్వీట్ లో రాశారు.

https://ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో ప్రజలంతా తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. జిల్లా, నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫార్మాట్ లో ఉంటుంది. మీరు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తారో చూసుకొని దానికి సంబంధించిన జాబితాను పరిశీలించుకోవాలి. ఇదే వెబ్‌సైట్‌లోనే పై సెర్చ్‌ యువర్‌ నేమ్‌ అనే ఆప్షన్ కూడా ఉంది.

tdp chief chandrababu tweet on check your vote and get your vote

https://voterportal.eci.gov.in వెబ్‌సైట్‌‌లో సెర్చ్‌ ఇన్‌ ఎలక్టోరల్‌ రోల్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి, ఫొటో ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఎంటర్ చేసి పేరు ఉందా? లేదా? తెలుసుకోవచ్చు. ఏ పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉంది? సీరియల్‌ నంబర్‌ ఎంత అనే వివరాలు కూడా ఉంటాయి. Voter Helpline మొబైల్‌ యాప్‌‌లో ఫోన్‌ నంబర్‌, వివరాలతో రిజిష్టర్‌ చేసుకుని, లాగిన్‌ అయితే అందులో కూడా తెలుసుకోవచ్చు. ఫొటో ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న బార్‌ కోడ్‌ను యాప్‌లో స్కాన్‌ చేసి ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా సులువుగా తెలుసుకోవచ్చు. ఓటు లేకపోతే సమీపంలోని తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+