రాకెట్ సైన్స్ చదవాలా? అని అడిగావుగా.. ఇప్పుడెక్కడ?
అన్నదాతల ఆక్రందనే రేపు ఉప్పెనగా మారుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ ఉప్పెనలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొట్టుకుపోతుందని జోస్యం చెపపారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న పంటల వివరాలను ఇప్పటికీ ఎందుకు వెల్లడించలేదంటూ ట్వీట్ చేశారు.
రబీకి సంబంధించి పంటల బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచి పెట్టడానికి కారణాలు ఏమిటని, అకాల వర్షాలకు అన్నదాతకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎక్కడని చంద్రబాబు ప్రశ్నించారు. దెబ్బతిన్న పంట ఎంత? కొన్న ధాన్యం ఎంతో చెప్పాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతును ఆదుకోడానికి రాకెట్ సైన్స్ చదవాలా అన్న జగన్, ఇప్పుడు ఎక్కడ ముడుచుకుని కూర్చున్నారని సెటైర్లు వేశారు. 15 జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరకు కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదన్నారు..

చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతన్నల కన్నీటి బాధలు పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్‌కు కనువిప్పు కలిగించాలని ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా #FarmersSufferingInAP అనే హ్యాట్ ట్యాగ్‌తో వేల సంఖ్యలో ట్వీట్స్ వేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. రాజమండ్రి సమీపంలోని వేగమిరి దగ్గర ప్రాంగణ నిర్మాణానికి భూమిపూజ చేయబోతున్నారు. రేపు ఉదయం 9.25 గంటలకు ముహూర్తం నిర్ణయించగా పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర యువగళం ఈనెల 15వ తేదీకి 100 రోజులకు చేరుకోబోతోంది. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications