చిన్న సినిమాకు అద్దిరిపోయే కలెక్షన్స్.. థియేటర్లకు క్యూ కడుతున్న యూత్..!
కంటెంట్ ఈజ్ కింగ్ అనే నానుడి టాలీవుడ్ లో ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. భారీ బడ్జెట్.. పెద్ద పెద్ద హీరోల సినిమాలు ప్లాఫ్ లు అవుతుండగా చిన్న సినిమాలు మాత్రం సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అవుతున్నాయి. కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధిస్తుందని ఇటీవల రిలీజ్ అయిన మరో సినిమా నిరూపించింది. అదే యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ 'హుషార్ పిట్టలు'.. ఎలాంటి పెద్ద అంచనాలు లేకుండా, కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లతో దూసుకుపోతోంది. హుషార్ పిట్టలు మూవీ ఆగస్టు 15న విడుదలైంది. ఈ బోల్డ్ టీనేజ్ రొమాంటిక్ డ్రామా కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. యూత్ ఫుల్ రొమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ మెసేజ్ కూడా ఈ మూవీ అందించింది.
'హుషార్ పిట్టలు' మూవీని బిక్షు యాదవ్ అనే నూతన దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలో ఆయన ఎంచుకున్న బోల్డ్ కథాంశం, టీనేజ్ రిలేషన్ షిప్స్ యువతను మెప్పించాయి. ఇక కొత్త జంట అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో అలరించారు. ఇక ఈ మూవీ ఇప్పటికే రూ. 4 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటేసింది. దాంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంచి కథాబలం ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నిరాశపరచరని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
మూవీ స్టోరీ విషయానికి వస్తే గీత కార్మికుడు (గోవర్ధన్ రెడ్డి) కూతురు చిట్టి (వాసవి గణేషన్)కు చిన్నతనం నుంచే శృంగారపరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఆ కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. అయితే అదే గ్రామంలో ఉండే అబ్బాయి రవి (అన్షు) తో కనెక్ట్ అవుతుంది చిట్టి. ఇద్దరూ కలిసి వాళ్ల తల్లిదండ్రులకు తెలియకుండా శృంగారంలో మునిగి తేలుతుంటారు. ఈ క్రమంలో చిట్టి ప్రెగ్నెంట్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగింది..? రవి ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారు..? చివరకు రవి, చిట్టి శృంగార కథకు ముగింపు ఏంటి..? అనేదే ఈ సినిమా స్టోరీ..

మరోవైపు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ మేరకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి యూత్ ను ఈ మూవీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.












Click it and Unblock the Notifications