వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ: సొంత జిల్లా..కేంద్ర పథకానికి లింక్ పెడుతూ

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని విమానాశ్రయానికి పూర్వ వైభవాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు ఈ లేఖను రాశారు. కడప నుంచి ఇతర ప్రాంతాలకు విమాన సర్వీసులు పునరుద్దరించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉడాన్ పథకాన్ని వినియోగించుకోవాలని అన్నారు.

కడప నుంచి విమాన సర్వీసులు అందుబాటులో లేకపోవడం వల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి విమాన సర్వీసులు అత్యవసరమని గుర్తు చేశారు. కడప ఎయిర్ పోర్ట్‌లో విమానాలు నిలిచిపోవడం, రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోవడం వల్ల పెట్టుబడిదారులు పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు రాలేరని చంద్రబాబు చెప్పారు.

TDP Chief Chandrababu writes to AP CM YS Jagan seeking flights resume from Kadapa airport

తమ ప్రభుత్వ హయాంలో ఉడాన్ పథకాన్ని వినియోగించుకుని.. కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. అనంతపురం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు హైదరాబాద్, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ ఎయిర్‌పోర్ట్ ఒక్కటే మార్గమని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా టయర్-2, టయర్-3 నగరాలకు విమాన సర్వీసులను నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని అమలు చేసిందని, దీన్ని వినియోగించుకుని.. పొరుగు రాష్ట్రాల రాజధానులకు తాము ఫ్లయిట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.

Recommended Video

    చాలా కాలం తర్వాత హైదరాబాద్ పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు!!

    కొద్దిరోజులుగా ఈ ఎయిర్ పోర్ట్‌లో విమాన సర్వీసులు స్తంభించిపోవడం వల్ల వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఎయిర్ కనెక్టివిటీ లేకుండా పోయిందని అన్నారు. దీన్ని వెంటనే వినియోగంలోకి తీసుకుని రావాలని సూచించారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పిన తరువాత.. కడప విమానాశ్రయానికి పారిశ్రామికవేత్తల తాకిడి పెరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కడప నుంచి విజయవాడకు రోడ్ కనెక్టివిటీతో పాటు ఎయిర్ కనెక్టివిటీని మరింత మెరుగుపర్చాలని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+