వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబునాయుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రయివేట్ లిమిటెడ్??

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ముఖ్య‌మంత్రిగా ప‌రిపాల‌న కొన‌సాగించే త‌రుణంలో ఒక ఆర్థిక‌వేత్త‌లా వ్య‌వ‌హ‌రించేవారు. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందివ్వ‌డం వారి భ‌విష్య‌త్తుకు, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మంచిది కాద‌నే భావ‌న‌లో ఉండేవారు. అందుకే ఆయ‌న ప‌రిపాల‌నలో తెచ్చుకున్నంత పేరును పార్టీప‌రంగా తెచ్చుకోలేక‌పోయారు. బ‌హుశా ఆయ‌న ఎంఏలో ఎక‌నామిక్స్ చ‌దివారు కాబ‌ట్టి ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై గ‌ట్టి ప‌ట్టుండ‌టంవ‌ల్ల సంక్షేమ ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌కు చాలా దూరంగా ఉండేవారు.

Recommended Video

జగన్ చేసిన సంక్షేమానికి మించి అంటూ....*AP Politics || Telugu OneIndia
 సంక్షేమంలో వెనకబడ్డారు!

సంక్షేమంలో వెనకబడ్డారు!


కానీ 1983లో అధికారం చేప‌ట్టిన ఎన్టీ రామారావులా, 2004లో అధికారం చేప‌ట్టిన దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిలా, 2014లో ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్‌లా, 2019లో సీఎం అయిన వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిలా సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అందించ‌డంలో వెన‌క‌బ‌డ్డారు. 2019 ఎన్నిక‌ల చివ‌ర‌లో కొన్ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ అప్ప‌టికే చేయి దాటిపోయింది. తాజాగా కుప్పం ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న ఆ పార్టీ శ్రేణుల‌ను ఆనంద‌ప‌రిచింది.

 కొత్త సంక్షేమ పథకాలతో మీ ముందుకొస్తా?

కొత్త సంక్షేమ పథకాలతో మీ ముందుకొస్తా?

తాను అధికారంలోకి వ‌స్తే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌య‌నింప‌చేయ‌డంతోపాటు కొత్త సంక్షేమ ప‌థ‌కాల‌తో మీ ముందుకు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత వైసీపీ ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌క‌న్నా మిన్న‌గా ఉండేలా స‌రికొత్త ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అభివృద్ధిపై ఎక్కువ‌గా దృష్టిసారించి రాష్ట్రాన్ని ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నింప‌చేయ‌డంతోపాటు సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా దృష్టి సారించాల‌ని, లేదంటే పార్టీకి భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని చంద్ర‌బాబు గ్ర‌హించారు.

 కొత్త పథకాలకు రూపకల్పన

కొత్త పథకాలకు రూపకల్పన


ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ అమలు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాల‌క‌న్నా మిన్నగా కొత్త ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. దీనికోసం ప్ర‌త్యేకంగా ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కూడా దృష్టిలో ఉంచుకొని మెరుగైన ప‌థ‌కాల‌ను ఈ టీమ్ రూపొందిస్తోంది. సమ‌ర్థ‌వంత‌మైన నేత‌గా, ప‌రిపాల‌కుడిగా పేరున్న బాబు సంక్షేమం విష‌యంలో వెన‌క‌బడ్డారు. ఎన్టీఆర్, వైఎస్‌, జ‌గ‌న్‌లా పేరు తెచ్చుకోలేక‌పోయారు. ఇప్పుడు వారిని మించి పేరు తెచ్చుకునేలా ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేయ‌బోతున్నారు. సంక్షేమ పథకాలను అందించడంలో తెలుగుదేశం పార్టీ కూడా ముందంజలో ఉంటుందని నిరూపించడానికి బాబు కంకణబద్ధులైనట్లు స్పష్టమవుతోంది.

English summary
chandrababu promised to implement new schemes which would be better than the welfare schemes offered by the present YCP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X