మద్యం మత్తులో టిడిపి కార్పొరేటర్ వీరంగం: పోలీసులపై చిందులు
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలో దీపావళి పండగ రోజున ఆదివారం అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ శ్రీనివాసరావు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పోలీసులతో గొడవకు దిగాడు. తన అనుచరుడి బేకరీ షాపు ఎందుకు మూయించారంటూ పోలీసు వాహనం ముందు చిందులు వేశాడు.
ఆ తర్వాత ఆయన సతీమణి శ్రీనివాసరావును తీసుకుని వెళ్లింది. కాగా, మళ్లీ సోమవారం తెల్లవారుజామునే వచ్చిన కార్పొరేటర్ శ్రీనివాసరావు మరోసారి ఆందోళనకు దిగారు. తన అనుచరుడ్ని వెంటనే విడుదల చేయాలంటూ ధర్నాకు దిగారు.

మద్యం షాపులో 10గంటలకు మూసివేయిస్తే ఫరవాలేదు గానీ, స్వీట్ల దుకాణాలు కూడా బంద్ చేయిస్తే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. పండగ రోజున స్వీట్ల దుకాణం 11గంటల వరకు తెరచి ఉంటే ఇబ్బందేమిటని శ్రీనివాసరావు నిలదీశారు. వెంటనే తన అనుచరుడ్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications