'తమ్ముడూ.. జగన్! అన్నొస్తున్నాడంటే ఎన్టీఆర్ గుర్తొచ్చారు, కేవీపీతో కలిసినందుకు సారీ చెప్పు'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలుబొమ్మగా మారారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు ఆదివారం మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు చంద్రబాబును అరెస్టు చేయాలా అని ప్రశ్నించారు. అవినీతి సంఘానికి జగన్ అధ్యక్షుడు అన్నారు. జగన్ అవినీతి చరిత్ర బీబీసీలో కూడా ప్రసారమైందని ఎద్దేవా చేశారు.

చదవండి:

జగన్‌పై అంతకుముందు రోజు మంత్రి దేవినేని విమర్శలు గుప్పించారు. తమ్ముడూ.. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే హక్కును విడిచిపెట్టి ఉదయం, సాయంత్రం నడుస్తూ, మైకు పట్టుకొని మాట్లాడటం సరికాదని, పట్టిసీమ పథకం దండుగ అని అసెంబ్లీలో మాట్లాడినందుకు కృష్ణా డెల్టా రైతులకు క్షమాపణ చెప్పాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు.

  లేఖలో ఏముందో చూసుకోకుండా సంతకం, ఇదీ జగన్ అంటే

  చదవండి:

  జగన్! అన్నొస్తున్నాడంటే ఎన్టీఆర్ గుర్తొచ్చారు

  జగన్! అన్నొస్తున్నాడంటే ఎన్టీఆర్ గుర్తొచ్చారు

  కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న వైయస్ జగన్ తాను వేసే ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని దేవినేని అన్నారు. ఆ తర్వాతే ఇక్కడ పర్యటించాలని దేవినేని వ్యాఖ్యానించారు. అన్నొస్తున్నాడు అని బ్యానర్ కనిపించిందని, అన్న అంటే అరవై ఏళ్ల వయస్సులో సినిమా గ్లామర్‌ను వదిలేసి ప్రజల కోసం 35వేల కిలోమీటర్ల బస్సు యాత్ర చేసిన ఎన్టీఆర్ గుర్తుకు వచ్చారని వ్యాఖ్యానించారు.

  కేవీపీతో కలిసి అలా చేసినందుకు క్షమాపణ చెప్పు

  కేవీపీతో కలిసి అలా చేసినందుకు క్షమాపణ చెప్పు

  గతంలో జగన్ పట్టిసీమ దండుగ అని చెప్పారని, దానికి ఆయన క్షమాపణ చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. రాయలసీమకు పట్టిసీమతో ఏం ప్రయోజనమని అసెంబ్లీలో జగన్ మాట్లాడారన్నారు. పట్టిసీమ ద్వారా సీమ జిల్లాలకు 146 టీఎంసీల నీటిని ఇచ్చి పంటలను కాపాడిన ఘనత టీడీపీదే అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్ర రావుతో కలిసి ప్రాజెక్టు కీలక నిర్మాణాల టెండర్లను ప్రీక్లోజరు చేయించినందుకు క్షమాపణ చెప్పాలన్నారు.

  అమరావతి రైతులను రెచ్చగొట్టలేదా?

  అమరావతి రైతులను రెచ్చగొట్టలేదా?

  నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను రెచ్చగొట్టి నిర్మాణాన్ని ఆపాలని ప్రయత్నాలు చేయలేదా అని దేవినేని మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ స్వయంగా మంత్రులు వెళ్లినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నియంతృత్వ పోకడలతో దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరా గాంధీకి దేశ ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో ప్రధాని నరేంద్ర మోడీకి అలాగే బుద్ధి చెబుతారని కళా వెంకట్రావు వేరుగా అన్నారు.

  విషం కక్కుతున్నారు

  విషం కక్కుతున్నారు

  అమరావతిపై వైసీపీ నాయకులు విషం కక్కుతున్నారని టీడీపీ నేత శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. రాస్తే రాష్ట్రానికి కేంద్రం ఎన్ని విధాలుగా అన్యాయం చేసిందో .. చేస్తుందో రాయండి అని వ్యాఖ్యానించారు. అది వదిలేసి అమరావతిపై పుస్తకాలు ఎందుకని, బీజేపీపై ప్రజల ఆగ్రహం తగ్గించడానికి వైసీపీ కోవర్టులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిపై దాడికి ఇది సమయమా అన్నారు.

  నువ్వు జైలుకు వెళ్లావని, చంద్రబాబు వెళ్లాలా?

  నువ్వు జైలుకు వెళ్లావని, చంద్రబాబు వెళ్లాలా?

  విజయవాడ సభలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబును జైలుకు పంపించాలన్నారు. దీనిపై మంత్రి జవహర్ ఆక్షేపం తెలిపారు. చంద్రబాబుకు నీ తండ్రి వయస్సు ఉంటుందని, ఆయన గురించి సంస్కారం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. రైతు రుణ మాఫీ చేసినందుకు జైలుకు పంపించాలా, డ్వాక్రా రుణాలు మాఫీ చేసినందుకు పంపించాలా అని నిలదీశారు. జగన్ జైలుకు వెళ్లొచ్చాడని చంద్రబాబు సహా ఇతరులు జైలుకు వెళ్లాలనే మనస్తత్వం సరికాదన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugudesam Party demanded YSR Congress Party chief YS Jagan apology for his comments on Pattiseema and Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X