బీజేపీతో పొత్తులో ఉన్నామా లేదా ? టీడీపీలో అనుమానాల వెనుక కారణమిదే...!

ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కార్ ను గద్దెదించే లక్ష్యంతో విపక్ష టీడీపీ ఇటు జనసేన, అటు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ లేకుంటే, ముఖ్యంగా కాషాయ దళం ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో గత ఎన్నికల్లోనే చూసేసిన టీడీపీకి ఈసారి ఎలాగైనా కమలనాథులతో పొత్తు అనివార్యమైంది. దీంతో పవన్ కళ్యాణ్ సాయంతో బీజేపీని ఆశ్రయించి పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఈసారి కూడా చుక్కలు కనిపిస్తున్నాయంట.

ముఖ్యంగా రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాల్ని గమనిస్తే అసలు తాము బీజేపీతో పొత్తులో ఉన్నామా లేదా, ఉంటే ఇలా ఎందుకు జరుగుతోందన్న చర్చ తెలుగు తమ్ముళ్లలో జరుగుతోంది. రాష్ట్రంలో ఈసారి ఎన్నికల సందర్భంగా తొలిసారి ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన పల్నాడు సభలో చోటు చేసుకున్న పరిణామాల్ని మొదలుపెడితే పదే పదే నారా లోకేష్ వాహనాల తనిఖీలు, రఘురామ రాజు ఎపిసోడ్, బీజేపీపై జగన్ మౌనం ఇవన్నీ టీడీపీలో అసంతృప్తిని రేపుతున్నాయి.

tdp doubts whether they are in tie-up with bjp or not with these reasons

ఈసారి ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న ప్రధాన కారణం ఎలక్షన్ మేనేజ్ మెంట్. అంటే ఎన్నికల సమయంలో పరిస్దితుల్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియంత్రిస్తోంది కాబట్టి వారితో పొత్తుంటే ఎన్నికల తీరాన్ని సులువుగా దాటొచ్చనేది వారి భావన. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్దితుల్ని గమనిస్తుంటే వారు అనుకున్న విధంగా ఎక్కడా జరగడం లేదట. తాము చెప్పినట్లు బీజేపీ వినాల్సింది పోయి, బీజేపీ ఏం చెప్పినా వినాల్సిన పరిస్ధితులు తలెత్తుతున్నాయని టీడీపీ నేతలు వాపోతున్నారు.

ఇలా బీజేపీని టీడీపీ అనుమానించడం వెనుక ఉన్న కారణాల్ని ఓసారి గమనిస్తే..ఈ మధ్య కాలంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ల మీద ఈసీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. లోకేష్ వాహనాల్ని పదే పదే ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు వైసీపీ నేతల్ని ఆ రేంజ్ లో పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం వేటు వేసి వదిలేస్తున్నారనేది మరో కారణం. రఘురామరాజుకు ఇస్తామని తీసుకుని నరసాపురం సీటును తమ నేతకు ఇచ్చుకోవడం ఇంకో కారణం. దీంతో జగన్, బీజేపీ ఒక్కటేనన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

అదే సమయంలో బీజేపీని ఇప్పటివరకూ జగన్ నేరుగా విమర్శించింది లేదు. విపక్షాలపై విమర్శలు చేయాల్సి వస్తే చంద్రబాబు, పవన్ కే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ పొత్తులో భాగంగా ఓడిపోయే సీట్లు తీసుకుని వైసీపీకి మేలు చేస్తుందనే అనుమానం మరోవైపు టీడీపీ క్యాడర్ లో కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+