'చంద్రబాబు ఇమేజ్ చాలా గొప్పది': కాకినాడలో ఓడిన ఎమ్మెల్యే అన్న కొడుకు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇమేజ్ కాకినాడను కూడా పార్టీ గొడుగు కొందకు తీసుకువచ్చిందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శుక్రవారం వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇమేజ్ కాకినాడను కూడా పార్టీ గొడుగు కొందకు తీసుకువచ్చిందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శుక్రవారం వ్యాఖ్యానించారు.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాల్లో టిడిపి సత్తా చాటింది. 30 ఏళ్ల తర్వాత టిడిపి ఇక్కడ గెలిచింది. సైకిల్ దూకుడుతో అమరావతి, కాకినాడలో టిడిపి సంబరాలు చేసుకుంది.
మొత్తం 48 డివిజన్లలో పదిన్నర గంటల వరకు టిడిపి 29 స్థానాలు, వైసిపి 8 స్థానాలు, బిజెపి 3 స్థానాలు గెలుచుకుంది. మరిన్ని స్థానాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చినరాజప్ప మాట్లాడారు.

చంద్రబాబు ఏమిటో తెలిసింది
గత మూడు సంవత్సరాల వ్యవధిలో జరిగిన అభివృద్ధి ఫలితమే ఈ ఫలితాలు అని చినరాజప్ప అన్నారు. ప్రజలకు చంద్రబాబుపై ఎంతో నమ్మకం ఉందని, ఆయన ఏమిటో ఈ ఎన్నికల ఫలితాలతో మరోసారి తెలిసి వచ్చిందన్నారు. చంద్రబాబు ఇమేజ్ చాలా గొప్పది అన్నారు.

ఆనందాన్ని ఇచ్చింది
నంద్యాల ఫలితమే ఇక్కడ కూడా పునరావృతం కావడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చినరాజప్ప అన్నారు. భవిష్యత్తులో విశాఖపట్నం స్థాయిలో కాకినాడను అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా తొలుత డ్రైనేజీ మరమ్మతులు చేపట్టనున్నామన్నారు.

ఓడిపోయిన ఎమ్మెల్యే అన్న కొడుకు
కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించింది. అయితే, స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తేలింది. టిడిపి ఎమ్మెల్యే కొండబాబు అన్న కుమారుడు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 22వ డివిజన్ నుంచి పోటీచేసిన కొండబాబు అన్న వమనాడి సత్యనారాయణ కుమారుడు శివప్రసాద్ వైసిపి అభ్యర్థి జాన్ కిశోర్ చేతిలో ఓడిపోయారు.

అందువల్లేనని..
డివిజన్‌లో అభివృద్ధి కుంటుపడటం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో విసిగిన ప్రజలు తమ ఆగ్రహాన్ని ఈ విధంగా చూపించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications