• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలో మార్పు వ‌చ్చంది.. క్ష‌మించండి ఇక త‌ప్పు చేయ‌ను .. య‌ర‌ప‌తినేని భావోద్వేగం

|
Google Oneindia TeluguNews

నాలో మార్పు వ‌చ్చింది న‌న్ను న‌మ్మండి.. నేను త‌ప్పు చేస్తే శిర‌స్సు వంచి క్షమాపణలు చెబుతున్నా.. క్ష‌మించండి. ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో కాదు.. పౌరుషాలకు మారుపేరుగా నిలిచిన గుంటూరు జిల్లా టీడీపీ సీనియ‌ర్ నేత‌, గుర‌జాల మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు. ఇక నుంచి ప్ర‌తి గ్రామంలో తిరిగి ప్ర‌తి కార్య‌క‌ర్త‌ల‌ను క‌లుస్తాను.. మీ వెంటే ఉంటాను అన్నారు. గ‌తంలో జ‌రిగిన త‌ప్పులు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూసుకుంటా అని య‌ర‌ప‌తినేని భావోద్వేగానికి లోన‌య్యారు.

 త‌న‌ చుట్టూ ఉన్న వారితోనే అస‌లు స‌మ‌స్య‌లు..

త‌న‌ చుట్టూ ఉన్న వారితోనే అస‌లు స‌మ‌స్య‌లు..


గ‌త‌ ఎన్నిక‌ల్లో వైసీపీ నేత‌ కాసు మ‌హేష్ రెడ్డి చేతిలో ఘోర ప‌రాజ‌యం పాలైన య‌ర‌ప‌తినేని ఈసారి ఆ ప‌రిస్థ‌తి త‌లెత్త‌కుండా ముందే జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఇప్ప‌టి నుంచి గ్రామాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుడుతున్నారు. గ‌తంలో జ‌రిగిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటూ మ‌ళ్లీ అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కాగా , ఏపీ వ్యాప్తంగా టీడీపీకి వీచిన ఎదురుగాలులు త‌న ఓట‌మికి కార‌ణం కాద‌ని ఆయ‌న‌ భావించ‌డంలేదు. దీనికి కార‌ణం గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో త‌నపై ఉన్న తీవ్ర వ్య‌తిరేక‌త‌తో పాటు, త‌న‌ చుట్టూ ఉన్న వారితోనే అస‌లు స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయ‌న్న యోచ‌న‌లో ఉన్నారు. ఈ ప‌రిణామాలు మ‌ళ్లీ త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్న ఆయ‌న టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు, స్థానిక నేత‌ల‌ను క్ష‌మాప‌ణ కోరుతున్నార‌ని పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 శిర‌స్సు వంచి క్ష‌మాప‌ణ చెబుతున్నా..

శిర‌స్సు వంచి క్ష‌మాప‌ణ చెబుతున్నా..


దాచేప‌ల్లిలో టీడీపీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చా వేదిక నిర్వహించారు. ఈకార్య‌క్ర‌మంలో పాల్గొన్న య‌ర‌ప‌తినేని మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను ఆద‌రించాల‌ని కోరారు. జ‌న‌వ‌రి నుంచి ప్ర‌తి గ్రామంలో ప‌ర్య‌టించి ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను క‌లుస్తాన‌ని పేర్కొన్నారు. అంద‌రిని క‌లుపుకుని వెళ్తాన‌ని అన్నారు. గ‌తంలో జ‌రిగిన త‌ప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటాన‌ని తెలిపారు. ఒక వేళ తాను త‌ప్పు చేసి ఉంటే శిర‌స్సు వంచి క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌ని అన్నారు. ఇక‌పై విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి ప‌ట్టుద‌ల‌తో పార్టీని గెలిపించుకుందామ‌ని అన్నారు. కార్య‌క‌ర్త‌ల‌కు తాను ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటాన‌ని , ఎవ‌రూ అదైర్య‌ప‌డొద్ద‌ని య‌ర‌ప‌తినేని ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప‌ని అయిపోయింద‌ని విమ‌ర్శించారు.

 వైసీపీ నేత‌ల‌కు ప్ర‌జా కోర్టులో శిక్ష‌..

వైసీపీ నేత‌ల‌కు ప్ర‌జా కోర్టులో శిక్ష‌..

జ‌గ‌న్ రెండున్నారేళ్ల పాల‌నలో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు పెట్ట‌డం, వేధింపుల‌కు గురిచేయడం త‌ప్ప అభివృద్ధి శూన్య‌మ‌ని య‌ర‌ప‌తినేని ఆరోపించారు. ప‌ల్నాడులో ఆడ‌ప‌డుచుల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్న వైసీపీ నేత‌ల‌ను ప్ర‌జా కోర్టులో శిక్షించే రోజు తెలుగుదేశం పార్టీతోనే వ‌స్తుంద‌న్నారు. రైతుల‌ను ఆదుకోవ‌డంలో జ‌గ‌న్ స‌ర్కార్ వైఫ‌ల్యం చెందింద‌ని విమ‌ర్శించారు. వ‌ర్షాల‌తో పంట న‌ష్ట‌పోయిన రైతులు ఆందోళ‌న చేస్తున్నా ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల‌కు ఎలాంటి క‌ష్ట‌మొచ్చినా ఆదుకునేది ఒక్క టీడీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని తెలిపారు. గ‌తంలో ప్ర‌కృతి వైప‌రిత్యాల‌తో పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు పార్టీల‌తో సంబంధం లేకుండా టీడీపీ ప్ర‌భుత్వం వారి ఖాతాల‌కే నేరుగా నిధులు జ‌మ చేసిన‌ట్లు గుర్తు చేశారు. నేడు పంట‌ల భీమాకు ఒక్క రూపాయి కూడా చెల్లించ‌లేని పరిస్థితిలో జ‌గ‌న్ త‌న పాల‌న కొన‌సాగిస్తున్నారని య‌ప‌తినేని శ్రీనివాస‌రావు మండిప‌డ్డారు.

English summary
Gurajala TDP Ex MLA Yerpathineni Srinivasa Rao apologizes to Public and Followers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X