వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

120 మంది తో టిడిపి తొలి జాబితా సిద్దం : పాలిట్ బ్యూరోలో ఆమోదం : తుది క‌స‌ర‌త్తులో చంద్రబాబు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP CM Chandrababu Naidu Finalizes Up To 120 TDP Candidates | Oneindia Telugu

ఏపి అధికార పార్టీ టిడిపి నుండి పోటీ చేసే అభ్య‌ర్ధుల‌తో తొలి జాబితా ఈ రాత్రికి విడుద‌ల కానుంది. సాయంత్రం టిడిపి పాలిట్ బ్యూరో లో ఈ జాబితా పై చ‌ర్చించి ఆమోద ముద్ర వేయ‌నున్నారు. అనంత‌రం మంత్రులు..జిల్లాల పార్టీ అధ్య‌క్షు ల‌తో చంద్ర‌బాబు స‌మావేశం అవుతారు. రాత్రికి తొలి జాబితా విడుద‌ల చేసేందుకు తుది క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది.

టిడిపి పాలిట్‌బ్యూరో లో ఆమోదం..!

టిడిపి పాలిట్‌బ్యూరో లో ఆమోదం..!

ఎన్నిక‌ల్లో పోటీ చేసే టిడిపి అభ్య‌ర్ధుల తొలి జాబితా క‌స‌ర‌త్తు తుది ద‌శ‌కు చేరింది. దాదాపు 120 మంది అభ్య‌ర్ధుల పేర్ల‌తో తొలి జాబితా విడుద‌ల చేసేందుకు రంగం సిద్ద‌మైంది. టిడిపి పాలిట్ బ్యూరో లో ఇప్ప‌టికే ఖ‌రారు చేసిన సీట్ల పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. కొన్ని స్థానాల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఉండ‌టంతో..అక్క‌డ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుం టుందీ పాలిట్ బ్యూరో స‌భ్యుల‌కు చంద్ర‌బాబు వివ‌రించ‌నున్నారు. అనంత‌రం మంత్రులు..టిడిపి జిల్లా అధ్య‌క్షుల‌తో చంద్ర‌బాబు స‌మావేశం అవుతారు. అందులో పార్టీ ఖ‌రారు చేసిన అభ్య‌ర్ధుల గెలుపు కోసం అనుస‌రించాల్సిన వ్యూహా లు..అసంతృప్తుల బుజ్జ‌గింపు ల‌పై చంద్ర‌బాబు దిశా నిర్ధేశం చేయ‌నున్నారు. అనంత‌రం తొలి జాబితాను రాత్రికి టిడిపి అధినేత అధికారికంగా విడుద‌ల చేస్తారు.

120 మంది తో జాబితా సిద్దం..

120 మంది తో జాబితా సిద్దం..

టిడిపి అధినేత చంద్ర‌బాబు దాదాపు 15 రోజులుగా అభ్య‌ర్ధుల ఖ‌రారు పై దృష్టి సారించారు. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ..వారి ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గం లోని ఆశావాహుల‌తో స‌మావేశం అయ్యారు. అనేక చోట్ల సిట్టింగ్ ల‌కు అవ‌కాశం ఇచ్చిన చంద్ర‌బాబు..మిగిలిన చోట్ల సిట్టింగ్‌ల‌కు ఎందుకు ఇవ్వ‌లేద‌నే అంశం పై వారికి న‌చ్చ చెప్పారు. సీట్లు ద‌క్క‌ని వారికి పార్టీ మ‌రో ర‌కంగా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని హామీలు ఇచ్చారు. అదే విధంగా కొత్త గా పార్టీలోకి వ‌చ్చిన వారికి...కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌టం పైనా అక్క‌డి స‌మీక‌ర‌ణాల‌ను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటున్న నిర్ణ‌యం గా సీయం చెప్పుకొచ్చారు.సాధార‌ణంగా నామినే ష‌న్ల వేళ‌..టిడిపి అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసేంది. అయితే, ఈ సారి భిన్నంగా ముందుగానే అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల చేస్తున్న ముఖ్య‌మంత్రి ప్ర‌చారానికి స‌మ‌యం కేటాయించ‌నున్నారు.

జ‌న‌సేన అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల‌: 4 లోక్‌స‌భ‌..32 అసెంబ్లీ స్థానాల‌కు ..!జ‌న‌సేన అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల‌: 4 లోక్‌స‌భ‌..32 అసెంబ్లీ స్థానాల‌కు ..!

ఇక‌, ప్ర‌చారంలోకి చంద్ర‌బాబు

ఇక‌, ప్ర‌చారంలోకి చంద్ర‌బాబు

ఇప్ప‌టికే జ‌న‌సేన తొలి జాబితా విడుద‌ల చేసింది. వైసిపి ఈ నెల 16న జాబితా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిం ది. ఇక‌, 120 స్థానాల‌తో తొలి జాబితా విడుద‌ల చేసిన త‌రువాత ముఖ్య‌మంత్రి మిగిలిన స్థానాల పైనా నిర్ణ‌యం ఒక‌టి రెండు రోజుల్లో తీసుకోనున్నారు. రేపు ముఖ్య‌మంత్రి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. 16వ తేదీ నుండి ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించాల‌ని సీయం నిర్ణ‌యించారు. తిరుమ‌ల వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకొని ప్ర‌చారానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. బ‌స్సు యాత్ర ద్వారా నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించేలా షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 18 నుండి నామినేష‌న్ల దాఖ‌లు ప్రారంభం కానుండ‌టంతో ఈ లోగానే అభ్య‌ర్దుల ఎంపిక ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని సీయం భావిస్తున్నారు.

English summary
TDP ready to release first list with 120 segments of party contesting candidates. The list will be accept in party polit buero meeting. By to day evening list may be released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X