చంద్రబాబుకు జగన్ షాక్: వైసిపిలో చేరిన టిడిపి మాజీ ఎమ్మెల్యే

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం షాకిచ్చారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో పలువురు వైసిపి, కాంగ్రెస్ నేతలను టిడిపి ఆకర్షిస్తోంది. అయితే, జగన్ టిడిపి అసంతృప్త నేతలపై దృష్టి సారించారు.

వైసిపిలోకి పలువురు

వైసిపిలోకి పలువురు

ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు వైసిపిలో చేరారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో టిడిపి నుంచి మరో కీలక నేత జగన్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత వాసిరెడ్డి వరద రామారావు ఈ రోజు జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

జగన్‌కు ఘన స్వాగతం

జగన్‌కు ఘన స్వాగతం

వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా నిలిచేందుకు జగన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. రణస్థలంలో ఆయనకు వైసిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

టిడిపి నేతకు వైసిపి కండువా కప్పిన జగన్

టిడిపి నేతకు వైసిపి కండువా కప్పిన జగన్

ఈ సమయంలో జగన్.. వాసిరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరికొంత మంది స్థానిక నేతలు కూడా కూడా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.

నేడు బహిరంగ సభ

నేడు బహిరంగ సభ

కాగా, వంశధార ప్రాజెక్టు వల్ల నిర్వాసితులుగా మారిన 13 గ్రామాల బాధితులకు అండగా నిలిచేందుకు శ్రీకాకుళం పర్యటనకు జగన్ వచ్చారు.

రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి బాధితులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ సాయంత్రం హీరమండలంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP former MLA Vasireddy Varada Rama Rao joins YSR Congress in the presence of YS Jaganmohan Reddy
Please Wait while comments are loading...