చట్టసభలోకి తొలిసారిగా: ఎమ్మెల్సీగా లోకేష్ ప్రమాణస్వీకారం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఎమ్మెల్సీగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రమాణం చేశారు. లోకేష్ తో పాటు కొత్తగా ఎన్నికలైన ఎమ్మెల్సీలతో మండలి చైర్మెన్ చక్రపాణి ప్రమాణం చేయించారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎన్నికయ్యారు. దీంతో లోకేష్ గురువారం ఉదయం పూట తన చాంబర్ లో లోకేష్ తో మండలి ఛైర్మెన్ ప్రమాణం చేయించారు.

tdp general secretary lokesh take charge as mlc

అయితే లోకేష్ ప్రమాణం చేసిన తర్వాత శాసనమండలిలోనే ఇతర సభ్యులతో చైర్మెన్ చక్రపాణి ప్రమాణం చేయించారు.టిడిపి నుండి బచ్చుల అర్జునుడ, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, బీటెక్ రవి, పోతుల సునీత, దీపక్ రెడ్డి, బిజెపి నుండి మాధవ్, పీడీఎఫ్ నుండి కత్తి నర్సింహ్మరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

లోకేష్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సినీ నటుడు బాలకృష్ణతో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తొలిసారిగా లోకేష్ చట్ట సభలో అడుగుపెట్టారు.

ఎమ్మెల్సీగా లోకేష్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ లోకేష్ ను ఆలింగనం చేసుకొన్నారు. లోకేష్ ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే పలువురు టిడిపి నాయకులు ఆయనను అభినందించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
tdp general secretary lokesh take charge as mlc on thursday. tdp and bjp mlcs oath as mlc today.
Please Wait while comments are loading...