న్యాయం జరగలేదు కానీ: బడ్జెట్‌పై టీడీపీ, రాజధానిపై..

బడ్జెట్ పైన టీడీపీ ఎంపీలు
కేంద్ర బడ్జెట్‌ను టీడీపీ ఎంపీలు స్వాగతించారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయిందని, ఆ తుప్పును వదిలించే ప్రయత్నం ఎన్డీయే చేస్తోందన్నారు. రాజధాని విషయంలో కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. ఆదాయ పరిమితి ఆశించిన స్థాయిలో పెంచలేదని చెప్పారు. అయినా అన్నీ ఒకేసారి సాధ్యం కాదని చెప్పారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగపడుతుందన్నారు. ఈ బడ్జెట్‌ను ప్రతి రంగం తమ బడ్జెట్‌గా భావించే అవకాశముందన్నారు.
సమస్యలు చర్చించుకుంటాం: పల్లె
ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, దాని కోసం ప్రయత్నాలు చేస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వేరుగా అన్నారు. వ్యవసాయంలో సంస్కరణలు చేస్తామన్నారు. రైతులకు ఉచితంగా కొత్త పంపుసెట్లు ఇస్తామన్నారు. ట్రాన్సుఫార్మర్లు కాలిపోతే 24 గంటల్లో మరమ్మతు చేస్తామన్నారు. పొరుగు సేవల ద్వారా ఎంపీవోల నియామకం ఉంటుందన్నారు. ప్రతి వెయ్యి మంది ఎంపీవోలకు రైతుమిత్ర గ్రూపులను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రతి శాఖలో, సేవలో ఐటి సేవలు అమలు చేస్తామన్నారు. అక్షరాస్యతను వంద శాతానికి పెంచే కృషి చేస్తామన్నారు. నీటి సంరక్షణకు క్షేత్రస్థాయి నుండి కృషి చేస్తామన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ త్వరగా జరపాలని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని తెలంగాణ సీఎంకు లేఖ రాస్తామన్నారు. బోధనా సమస్యలు ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications