విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇదేంటి, మరిచిపోయారు: టీడీపీకి పవన్ షాక్, 'నాలా తెలంగాణకు వెళ్లగలరా'

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ప్రత్యేక హోదా బదులు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారని గత కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి ఆయన ఓ రుజువును ట్వీట్ చేశారు.

Recommended Video

2019 ఎన్నికల పై పవన్ ధీమా

చిరంజీవి తర్వాత జగన్ సాహసం!: న్యూజిలాండ్‌లో బంగీ జంప్ (వీడియో)చిరంజీవి తర్వాత జగన్ సాహసం!: న్యూజిలాండ్‌లో బంగీ జంప్ (వీడియో)

టీడీపీ మరిచిపోయిందంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై తనను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలిసి ధన్యవాదాలు తెలిపారని.. నాడు ప్యాకేజీ ప్రకటించిన సమయంలో నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. దానిని పవన్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ తాను గతంలో ఏం చేసిందో తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసంమరిచిపోయింది అని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫోటోను ట్వీట్ చేశారు.

యువతతో నిండిపోయిన ఆర్కే బీచ్

యువతతో నిండిపోయిన ఆర్కే బీచ్

కాగా, శనివారం జనసేన కవాతు సమయంలో ఆర్కే బీచ్ యువతతో నిండిపోయింది. పవన్ ఆర్మీ దుస్తులు ధరించారు. ఆయనను అనుకరిస్తూ చాలామంది వచ్చారు. పవన్ తొలుత బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు వేలాది అభిమానులు, జనసైనికులతో కలిసి కవాతు చేశారు. కవాతులో అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. చాలామంది ఒకే తరహా దుస్తులతో రావడం ప్రధాన ఆకర్షణ.

పవన్ మాట్లాడుతున్నంతసేపు చప్పట్లు

పవన్ మాట్లాడుతున్నంతసేపు చప్పట్లు

పవన్ నడిచి వస్తున్నంత సేపు తీరమంతా నినాదాలు చేస్తూ ఉత్సాహపరిచారు. అందరూ ఆయనను అనుసరించారు. వైఎంసీఏ వద్ద మాట్లాడుతున్నంత సేపు చప్పట్లతో మార్మోగింది. పవన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. బీచ్ రోడ్డులోకి వాహనాలను అనుమతించలేదు. వైఎంసిఏ నుంచి మత్స్యదర్శిని వరకు జనంతో నిండింది.

తెలంగాణలో నేను దోపిడీ చేయలేదు

ఈ ఆంధ్రా నాయకుల్లో ఒక్కరైనా వెళ్లి తనలా తెలంగాణలో తిరగగలరా అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది. ఎందుకంటే నేను తెలంగాణలో దోపిడీకి పాల్పడలేదని, తెలంగాణను గుండెల్లో పెట్టుకున్నానని, కానీ ఈ ఆంధ్రా నాయకులు తిరగగలరా అని ప్రశ్నించారు. దీనిని జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది. పవన్ జనసేన కవాతులో ఈ వ్యాఖ్యలు చేశారు.

English summary
'TDP has conveniently forgotten what they had done in past about Special Status category status' Jana Sena chief Pawan Kalyan tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X