ఎగ్జిట్ పోల్స్‌పై ఆశలు వదులుకున్న టీడీపీ..?

దేశంలో ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. జూన్ 1తో ఎన్నికలు ముగుస్తాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు అడ్డుగా ఉండడంతో, సర్వే సంస్థలు తమ నివేదికను తెలియజేయడానికి వెనకడుగు వేస్తున్నాయి.దేశంలో ఆఖరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్‌ని బహిరంగంగా ప్రకటించేందుకు సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే దేశ రాజకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి.

ఏపీ ఎన్నికల్లో స్థానికత, సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ముందే ఓ అంచనాకు వస్తుంటారు. సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటిస్తాయి. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడంతో అది ఎవరికి మేలు చేస్తుందో అని రాజకీయ పార్టీలు ఓ అంచనాకు రాలేకపోతున్నాయి. పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు.ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు. దీంతో ఎగ్జిట్ పోల్స్‌పై రాజకీయ పార్టీలన్నీ కూడా ఆశలు పెట్టుకున్నాయి.

TDP has given up hope on exit polls

అయితే ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఎగ్జిట్ పోల్స్‌పై పెద్దగా ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన నివేదికల్లో కూడా కూటమిపై పెద్ద సానుకూల రిపోర్ట్ రాకపోవడంతో టీడీపీ నాయకులు డీలా పడ్డారని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే టీడీపీకి ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వస్తాయని వాళ్ళకి వాళ్లే లీకులు ఇస్తున్నట్టు ఉంది. దీంతో టీడీపీ క్యాడర్ డీలా పడిపోయి నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు, మొన్నటి వరకు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అని బెట్టింగ్‌లు విపరీతంగా వేసిన తెలుగు తమ్ములు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ అనుకూల మీడియాలో కూడా కూటమి అధికారంలోకి రాదనే చర్చ సాగుతోంది. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్‌పై టీడీపీ పెద్దగా ఆశలుపెట్టుకో లేదనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+