• search

టిడిపి మనసు దోచిన... "మదనపల్లె ఫార్ములా":సమస్య వస్తే...అదే వాడదాం

By Suvarnaraju
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అమరావతి:ఒకే సీటు కోసం ఆశావాహులు పంతాలు,పట్టింపులు పోయినప్పుడు సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు తమకు చక్కటి సూత్రం ఒకటి అందుబాటులోకి వచ్చిదని టిడిపి సంతోషపడుతోంది. దానికి ఆ పార్టీ వాళ్లు ముద్దుగా "మదనపల్లె ఫార్ములా" అని పేరు పెట్టుకున్నారు.

  అవును...దానికి ఆ పేరు రావడానికి కారణం ఆ ఫార్ములా కనిపెట్టింది మదనపల్లె టిడిపి నేతలే. అక్కడ ఒకే సీటు కోసం పోటీపడిన ముగ్గురు ఆశావాహులు...ఇలా పంతానికి పోతే అందరూ నష్టపోతామని గుర్తించి తమంతట తాముగా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక రాజీ ఫార్మాలాను వారే కనుక్కొని ఆ తరువాత దాన్ని అధిష్టానం ముందుంచారు. ఎవరికీ ఇబ్బంది లేని ఆ ఫార్ములాను టిడిపి అధిష్టానం కూడా ఆనందంగా ఆమోదించింది. వివరాల్లోకి వెళితే...

  ఫార్ములా...అధిష్టానం వద్దకు...

  ఫార్ములా...అధిష్టానం వద్దకు...

  సిఎం సొంత జిల్లా చిత్తూరులోని మదనపల్లె నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్‌ కోసం పోటీ పడుతున్న ముగ్గురు ముఖ్య నేతలు తమలో తాము ముందుగానే ఓ అంగీకారానికి వచ్చారు. ఆ ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించే అధికారాన్ని పార్టీ అధి నాయకత్వానికే అప్పగించారు. ఇక ఇప్పుడు తమలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని ముగ్గురూ ప్రకటించారు. వాళ్ల మధ్య సమస్య రాగా వాళ్లే చక్కటి పరిష్కారంతో రావడంతో పాటు తుది నిర్ణాయాన్ని అధిష్టానానికే వదిలేసిన తీరు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఎంతో సంతృప్తినిచ్చింది. సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతున్న ఈ ఫార్ములాను ఇలా పోటీదారులు అధికంగా ఉన్న ఇతర నియోజకవర్గాల్లో అమలు చేయాలని భావిస్తోంది.

   ఎన్టీఆర్ ను మించిన నటుడా పవన్: అశోక్ గజపతిరాజు
   ఇక్కడే సమస్య...పరిష్కారం కూడా

   ఇక్కడే సమస్య...పరిష్కారం కూడా

   మదనపల్లె ఎమ్మెల్యే సీటు కోసం టీడీపీలో చాలా గట్టి పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే దమ్మాలపాటి రమేశ్‌, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత రాందాస్‌ ఎవరికి వారు తమకే టికెట్‌ కావాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అందరూ పట్టున్న నేతలే కావడంతో టికెట్ పై హామీ ఎవరికివ్వాలో అధిష్టానానికి పాలుపోలేదు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పార్టీ నాయకత్వం ఈ సమస్య విషయమై చొరవ చూపి ముగ్గురు ఆశావాహులతోనూ మాట్లాడింది. ఒక ఫార్ములాను సూచించి వారిలో వారే మాట్లాడుకుని తుది నిర్ణయానికి రావాలని సూచించింది. ఆక్రమంలో ముగ్గురు నేతలూ కలిసి కూర్చుని మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చారు.

   ఒప్పందం ఇలా...అందరూ ఒకే

   ఒప్పందం ఇలా...అందరూ ఒకే

   ఆ ఒప్పందం ప్రకారం ఎమ్మెల్యే టికెట్‌ రేసు నుంచి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్‌రెడ్డి వైదొలుగుతారు. ప్రతిఫలంగా ఆయనకు పార్టీ నాయకత్వం ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఆ తరువాత మిగిలిన ఇద్దరు రమేష్, రాందాస్ లలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్‌, రెండో వారికి కార్పొరేషన్‌ అధ్యక్ష పదవి ఇవ్వాలి. అయితే వీరిద్దరిలో ఎవరికి టికెట్‌ ఇవ్వాలో పార్టీ అధినేత చంద్రబాబుదే నిర్ణయం. ఆ తరువాత వారు ఆ ఫార్ములాతో వెళ్లి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కలిశారు. ఇప్పుడు టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని, అందరం కలిసి పనిచేస్తామని ముగ్గురు నేతలూ ముందు లోకేష్ తో చెప్పారు. ఈ ఫార్ములా బాగుందని, అమలు చేస్తామని ఆయన వారికి తెలిపారు.

   లోకేష్, చంద్రబాబు, పార్టీ...ఓకే ఒకే

   లోకేష్, చంద్రబాబు, పార్టీ...ఓకే ఒకే

   ఆ తర్వాత ఈ ముగ్గురూ సోమవారం అమరావతిలో చంద్రబాబుతో సమావేశమై...తమ ఒప్పందం గురించి వివరించారు. దాన్ని ఆయన వెంటనే ఆమోదించారు.
   "మీరు కోరుకున్న ప్రకారం మీ ముగ్గురి ప్రయోజనాలు కాపాడతా...ముగ్గురూ కలిసి పనిచేసి మదనపల్లెలో ఈసారి పార్టీని గెలిపించుకుని రావాలి...అక్కడ గెలిస్తే మీ ముగ్గురికీ మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది"...అని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఫార్ములా టీడీపీ అధినాయకత్వానికి నచ్చింది. నాయకులు ఇలా తమలో తాము అంగీకారానికి వస్తే చాలా చోట్ల సమస్య పరిష్కారమవుతుందని...వారడిగిన ప్రకారం చేయడానికి తమకూ ఇబ్బంది ఉండదని టిడిపి సీనియర్‌ నేత ఒకరు అన్నారు.

   సమస్య వస్తే...మదనపల్లె ఫార్ములా

   సమస్య వస్తే...మదనపల్లె ఫార్ములా

   ఒకే సీటు కోసం నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలు 25 నుంచి 30 వరకూ ఉంటాయని టిడిపి అధిష్టానం అంచనా వేస్తోంది. వీటిలో ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. ఎమ్మెల్సీ పదవులు ప్రతి ఆరేళ్లకూ పెద్ద సంఖ్యలో ఖాళీ అవుతుంటాయి. వాటిని సర్దుబాటు చేయడం పెద్ద సమస్య కూడా కాదు. అలాగే కార్పొరేషన్‌ పదవులు కూడా ఇవ్వవచ్చు...ఆశావాహులైన నాయకులు ఇటువంటి సర్దుబాట్లకు తమంతట తాముగా అంగీకరిస్తే సమస్యలు తేలిగ్గా సర్దుబాటవుతాయని టిడిపి ముఖ్య నేతలు అంటున్నారు. ఇకపై చిక్కొచ్చిన చోట ఇదే మార్గంలో సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు వారు తెలిపారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Amaravati: TDP is pleased over a formula to solve problem with harmony between ticket Competitors for one single seat .This formula has been invented by Madanapalle TDP leaders, therefore the TDP high command named this as Madanapalle Formula.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more