సీనియర్ నేత, మాజీ మంత్రికి షాకిచ్చిన TDP!
రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరులను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ సోదరులకు వీరు అత్యంత దగ్గరివారు. ప్యాపిలి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు తొప్పెల శ్రీనివాసులు, డోన్ మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు టీఈ కేశన్నగౌడ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
పార్టీ గీసిన గీత దాటారు
పార్టీ గీసిన గీత దాటడంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ కర్నూలు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర యువగళం కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. ఇటీవల డోన్ నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర యువగళం జరిగింది. అక్కడి నియోజకవర్గ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా కొన్ని కరపత్రాలు వైరలయ్యాయి. వీటిని కేఈ ప్రభాకర్ వర్గం పంపిణీ చేసిందని సుబ్బారెడ్డి మనుషులు ఆరోపిస్తున్నారు.

లోకేష్ దగ్గరే పంపిణీ
లోకేష్ బసచేసిన ప్రాంతంలోనే కాకుండా యాత్ర జరిగే మార్గంలో కూడా వీటిని పంపిణీ చేశారు. కేఈ ప్రభాకర్ లోకేష్ ను కలిసిన సమయంలో లోకేష్ టెంట్ బయట వీటి పంపిణీ జరిగింది. సుబ్బారెడ్డి ఇన్ఛార్జిగా వద్దని, పార్టీకి నష్టమని, కోవర్ట్ అని ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు. కేఈ ప్రభాకర్ వర్గీయులే దీనివెనక ఉన్నట్లు స్థానిక టీడీపీ యంత్రాంగం చర్చల్లో వచ్చింది. ఈ క్రమంలోనే కేశన్న గౌడ్, శ్రీనివాసుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించినప్పుడు డోన్ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీచేస్తారని ప్రకటించారు.

టీడీపీలో గ్రూపు రాజకీయం
చంద్రబాబు ప్రకటన చేసినప్పటి నుంచి టీడీపీలో గ్రూపు రాజకీయం ప్రారంభమైంది. చంద్రబాబు ప్రకటన తర్వాత అనుచరులతో ప్రభాకర్ సమావేశమయ్యారు. లోకేష్ పాదయాత్ర సమయంలోనే ప్రభాకర్, సుబ్బారెడ్డి వర్గాలు బలప్రదర్శనకు దిగాయి. 1999లో డోన్ నుంచి కేఈ ప్రభాకర్ విజయం సాధించారు. 2009లో పత్తికొండ నుంచి విజయం సాధించారు. 2019లో ఓటమిపాలయ్యారు.












Click it and Unblock the Notifications