వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'2019'YCP వ్యూహాన్నే అమలు చేస్తోన్న TDP?

|
Google Oneindia TeluguNews

రాజకీయాల్లో వ్యూహ ప్రతి వ్యూహాలు సహజం. ఒక పార్టీపై మరో పార్టీ పైచేయి సాధించడానికి ఇవి అవసరం కూడా. అయితే ఎవరు ఎంత తెలివితో వ్యూహాలను అల్లుతారో వారినే విజయం వరిస్తుంది. పై చేయి సాధించడానికి వీలవుతుంది. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీతో పొత్తు కోరుకుంటున్న చంద్రబాబునాయుడు తన వ్యూహాన్ని మార్చుకున్నారు.

రాజీనామా చేయిస్తే బీజేపీ స్పందనేంటి?

రాజీనామా చేయిస్తే బీజేపీ స్పందనేంటి?

ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తన పార్టీకి చెందిన నలుగురు ఎంపీలతో సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నా.. ఆ పార్టీపై ఉండే వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవాలన్నా ఎంపీల చేత రాజీనామా చేయించాలనే ఆలోచన తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది? ఇలా చేస్తే టీడీపీకి ప్లస్సా? మైనస్సా? తదితర విషయాలను మరింత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

వైసీపీ ఒత్తిడి తెచ్చినట్లుగానే టీడీపీ?

వైసీపీ ఒత్తిడి తెచ్చినట్లుగానే టీడీపీ?

ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో వైసీపీ ఎలా వ్యవహరించిందో ప్రస్తుతం టీడీపీ కూడా అలాగే వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసం ఎంపీలచేత రాజీనామా చేయించి వైసీపీపై ఒత్తిడి పెంచితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఎంపీలతో బాబు చర్చించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా చంద్రబాబును కలిసి తాను కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారంటూ వార్తలు వచ్చాయి.

రాష్ట్రానికి న్యాయం జరగాలంటే..

రాష్ట్రానికి న్యాయం జరగాలంటే..

ఏపీకి ప్రత్యేక హోదాసాధించేందుకు టీడీపీ ఎంపీల రాజీనామాతోపాటు తాను కూడాసిద్ధంగా ఉన్నట్లు బాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. శీతాకాల సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనేదానిపై చంద్రబాబు ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. అయితే రాష్ట్రానికి న్యాయం జరిగేలా వ్యవహరించే విధానంపైనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీతో చెలిమిని కోరుకుంటున్నాం కాబట్టి ఒకవేళ రాజీనామాలు చేయిస్తే అది భవిష్యత్తు పొత్తులకు ఏమైనా వ్యతిరేకమవుతుందా? లేదంటే కేవలం రాజకీయ వ్యూహంగానే పరిగణిస్తుందా? అనే విషయంలోనే సందిగ్ధత నెలకొంది. అయితే చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.!

English summary
Every strategy in politics is natural.They are also necessary for one party to gain an upper hand over the other
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X