నెల్లూరు గడ్డపై వైసీపీకి భారీ జలక్, నెక్స్ట్ ఎవరు..!!

నెల్లూరు కేంద్రంగా రాజకీయాలు ఆసక్తి కరంగా మారాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా కంచుకోటగా ఉంది. 2019 జిల్లాలోని అన్ని సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. 2024 లో సీన్ రివర్స్ అయింది. అన్ని సీట్లు కూటమి గెలుచుకుంది. ఇక.. సీనియర్ల నేతలకు అడ్డగా నిలిచిన నెల్లూరులో వైసీపీకి మరో భారీ జలక్ ఇచ్చేందుకు టీడీపీ సర్వం సిద్దం చేసింది. ఇందుకు ముహూర్తం ఖరారు అయింది. ఇక... నెక్స్ట్ జరిగే పరిణామాల పై ఉత్కంఠ కొనసాగుతోంది.

నెల్లూరులో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. నెల్లూరు 2024 ఎన్నికల్లో అన్ని సీట్లకు టీడీపీ అభ్యర్ధులే గెలుపొందారు. ఆ ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన నేతలు ఎమ్మెల్యే లు అయ్యారు. ఆనం మంత్రిగా కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీ కేంద్రంగా ఇప్పుడు కొత్త వ్యూహా లు అమలు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మెజార్టీ కార్పోరేషన్లు, మున్సి పాలిటీల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీల్లోకి చేరారు. ఫలితంగా పలు మున్సిపాలిటీలు కూటమి కైవసం చేసుకుంది. ఇక.. ఇప్పుడు నెల్లూరు కార్పోరేషన్ పైన కూటమి ఫోకస్ చేసింది. టీడీపీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎమ్మెల్యే కోటం రెడ్డి స్కెచ్ సిద్దం చేసారు. ఫలితంగా మరో కార్పోరేషన్ టీడీపీ ఖాతాలో పడటం లాంఛనంగా కనిపిస్తోంది.

tdp-implementing-new-plans-to-get-nellore-mayor-seat-details-here

నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉండగా మొత్తం 56 డివిజన్లు ఉన్నాయి. సిటీ, రూరల్‌ నియోజకవర్గాల నుంచి టీడీపీ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉండగా.. ఇద్దరు ఎంపీలు ఉన్నారు. 56 డివిజన్లలో ప్రస్తుతం 29 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో 56 డివిజన్లను వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేయగా, అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఆ తర్వాత టీడీపీలోకి భారీగా కార్పోరేటర్లు వలస వచ్చారు . డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తోపాటు మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరినా మేయర్‌ మాత్రం వైసీపీలో ఉండటంతో సాంకేతికంగా ఈ కార్పొరేషన్‌ ప్రస్తుతానికి వైసీపీ ఖాతాలో ఉంది. కాగా, మంత్రి నారాయణ.. ఎమ్మెల్యే కోటంరెడ్డి తాజాగా కార్పోరేటర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కావటంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం కార్పోరేషన్ లో టీడీపీకి 43 మంది, వైసీపీకి 14 ఓట్లు ఉన్నాయి. రేపు మరోసారి కార్పోరేటర్లతో సమావేశం తరువాత మేయర్ పైన అవిశ్వాసానికి రంగం సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+