టీడీపీ ఎమ్మెల్యేలపై సంతృప్తిగా లేని ప్రజలు: తేల్చేసిన చంద్రబాబు సర్వే!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారా? అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సర్వే ఏం చెబుతోంది. ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నా, ఎమ్మెల్యేల తీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందట. ప్రభుత్వ పనితీరుతో పాటు ఎమ్మెల్యేల పనితీరుపై ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు స్వయంగా చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ సమన్వయ కమటీ బేటీలో ఈ అంశంపైనే ప్రధాన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబు ప్రత్యేకంగా ఈ సర్వే చేయించారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? ఎమ్మెల్యేల పనితీరు ఏ మేరకు ఉంది? అన్న అంశాలపై ప్రధానంగా సాగిన ఈ సర్వే నివేదికను గురువారం చంద్రబాబు సమన్వయ కమిటీ భేటీలో అందరి ముందు పెట్టారు.

 TDP Internal Survey Shows Mlas Lagging Behind

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. సుమారు ఐదు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరు, రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ముఖ్యంగా ప్రభుత్వ పనితీరుపై అత్యధిక శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సగానికి పైగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు అసంతృప్తితోనే ఉన్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. 30 నుంచి 35 శాతం మంది ఎమ్మెల్యేల తీరు ఫరవాలేదని చెప్పిన ప్రజలు, 25 నుంచి 30 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని, ఓ 10 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని సర్వే తేల్చేసింది.

దీంతో రెండేళ్లు పూర్తయినా ప్రభుత్వ పనితీరుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు తమ పనితీరుని మెరుగుపరచుకోకపోడాన్ని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను సంస్కరించడమెలా? అన్న అంశంపైనా ఆ భేటీలో సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది.

ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ కమిటీ వేసి పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను సంస్కరించాలని చంద్రబాబు నిర్ణయించారట. ఈ మేరకు కమిటీ ఏర్పాటుకు సమన్వయ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh cheif minister Chandrababu naidu conducted internal survey regarding mlas perfomance.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి