ఆసక్తికరం: చంద్రబాబు దీక్షకు కొణతాల రామకృష్ణ? మంత్రుల ఫోన్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 20వ తేదీన నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పాల్గొనే అవకాశముందనే ప్రచారం సాగుతోంది.

ఆయనకు మద్దతుగా దీక్షలో పాల్గొనేందుకు విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లనున్నారు. పార్టీలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు దీక్ష చేస్తున్నారని, ఈ దీక్షను అందరూ విజయవంతం చేయాలని టీడీపీ కోరుతోంది.

TDP invites Konathala for Chandrababu deeksha

ఇందులో భాగంగా ఇటీవల అఖిలపక్ష సమావేశానికి హాజరైన నేతలకు ఆహ్వానాలు కూడా పంపించింది. జిల్లా నుంచి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొణతాలకు కూడా ఆహ్వానం పంపించారు.

అంతేకాదు, మంగళవారం మంత్రి కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వర రావులు స్వయంగా ఫోన్ చేసి ఆయనను ఆహ్వానించారని తెలుస్తోంది. చంద్రబాబు దీక్షకు మీరు తప్పకుండా హాజరు కావాలని కోరారని సమాచారం. వామపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+