ఆ ఒక్క చర్యతో టీడీపీ క్యాడర్‌లో జోష్ పెంచుతున్న చంద్రబాబు..!!

Chandrababu: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ కొత్త జోష్ నెలకొంది. ఈ దఫా అధికారంలోకి రావడమే కాకుండా అటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ప్రధాన ఇరుసుగా మారింది టీడీపీ. 16 లోక్‌సభ సభ్యులతో అత్యంత బలమైన పార్టీగా ఆవిర్భవించింది.

ఈ స్థాయి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం- టీడీపీకి ఉన్న కార్యకర్తలేననడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. బూత్ స్థాయి నుంచి పార్టీని, దుర్భేధ్యమైన క్యాడర్‌ను నిర్మించుకోగలిగింది. అనేక ప్రతికూల పరిస్థితులు, సంక్షోభ సమయాలను అవలీలగా అధిగమించడానికి ఈ క్యాడరే కీలకం.

TDP is the only political party in India to offer life insurance and other welfare benefits for members

అందుకే కార్యకర్తల సంక్షేమం విషయంలో ఆ పార్టీ ఎలాంటి రాజీధోరణిని ప్రదర్శించట్లేదు. ప్రాథమిక సభ్యత్వం ఉంటే చాలు- ఆ కార్యకర్త కుటుంబాన్ని తనదిగా భావిస్తుంది. పెద్దన్నలా ఆదుకుంటుంది. టీడీపీలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం, రోజురోజుకూ ముమ్మరమౌతోన్న చేరికలను దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

పార్టీ స్థాపించిన 43 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనివిధంగా అతితక్కువ సమయంలో 50 లక్షలకు పైగా సభ్యత్వ నమోదును పూర్తి చేసింది టీడీపీ. కిందటి నెల 26వ తేదీన ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం 29 రోజుల్లో 50 లక్షలను దాటింది. 100 రూపాయల సభ్యత్వంతో తీసుకుంటే అయిదు లక్షల ప్రమాద బీమాను కల్పించడమే కాకుండా..పార్టీపరంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలనూ అందజేస్తోంది పార్టీ అగ్రనాయకత్వం.

అదే సమయంలో- టీడీపీలో చేరికలు జోరందుకుంటోన్నాయి. ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యే- ఎంపీలు, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పసుపు జెండా కిందికి చేరుతున్నారు. ఆ పార్టీకి జై కొడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఇప్పటివరకు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు సహా పలువురు టీడీపీలో చేరారు.

క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలంటే కార్యకర్తలే పునాదులని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బలంగా నమ్ముతారు. అందుకే వాళ్ల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలనైనా అమలు చేయడానికి వెనుకాడరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+