Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీతో పెట్టుకుంటే పవన్‌కు నష్టమే: మాజీ మంత్రి లెక్క ఇదీ..!!

అమరావతి: తెలుగుదేశం పార్టీ-జనసేన పొత్తుల వ్యవహారంపై కాపు సంక్షేమ సేన నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే పొత్తులు తప్పకపోవచ్చని మొన్నటివరకు స్పష్టం చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు మాట మార్చారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కూడా మెజారిటీ నియోజకవర్గాలను గెలుచుకుంటుందని, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన వేర్వేరుగా కలిసి పోటీ చేసినా పవన్ కల్యాణే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు పవన్ కల్యాణ్‌కు మంచిది కాదని హెచ్చరించారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

pawan chandra babu

14 సంవత్సరాల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ సరిదిద్దుకోలేని అనేక తప్పులను చేసిందని, అవి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని చేగొండి వ్యాఖ్యానించారు. వంగవీటి రంగా హత్యోదంతం మొదలుకుని, అవినీతి, ఒక సామాజిక వర్గానికి మాత్రమే మంచి చేస్తుందనే కులం ముద్ర ఆ పార్టీపై ఉందని పేర్కొన్నారు. వాటిల్లో ఏ ఒక్క దాన్ని కూడా ప్రజలు మరిచిపోలేదని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు.

కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్లను కల్పించే విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారని, జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లను కల్పించే విషయంలోనూ చంద్రబాబు అలసత్వాన్ని ప్రదర్శించారని గుర్తు చేశారు. ఈ కారణంతోనే కాపులు, బీసీలెవరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి ముందుకు రాబోరని పేర్కొన్నారు. అలాంటి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే- జనసేనకూ నష్టం కలుగుతుందని అంచనా వేశారు.

తెలుగుదేశం- జనసేన పార్టీలకు ఉమ్మడి శతృవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తప్పని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తే- 50:50 ప్రాతిపదికన సీట్లను పంచుకోవాల్సి ఉంటుందని హరిరామ జోగయ్య ప్రతిపాదించారు. సీట్ల కేటాయింపు అలా జరక్కపోతే జనసేనలో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని, టీడీపీపై వ్యతిరేక భావం అభిమానుల్లో ఏర్పడుతుందని, అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకకు కారణమౌతుందని విశ్లేషించారు.

 pawankalyanharirama

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే- మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే.. ముఖ్యమంత్రి పదవీ కాలం కూడా చెరిసగం పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. చంద్రబాబు పూర్తికాలం పదవిలో ఉంటే పవన్ కల్యాణ్‌ రాజకీయంగా చాలా నష్టపోతారని చెప్పారాయన.

చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకోవడం వల్లే పవన్ కల్యాణ్ అధికారాన్ని పంచుకోవట్లేదనే అపవాదు వస్తుందని హరిరామ జోగయ్య అన్నారు. అలాగే- కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టాడంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే ఆరోపణలు- నిజమేననే భావన ప్రజల్లో ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉండాలనేదే తన అభిమతమని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+