టీడీపీ-బీజేపీ పొత్తుపై జగన్ ఎం చెప్పబోతోన్నారు?: అందరి చూపులూ సిద్ధం సభపైనే
TDP BJP Alliance: ఊహించినట్టే- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. మరోసారి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరింది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పలు దఫాలుగా చర్చలు కొనసాగించడం, షరతులకు ఓకే చెప్పిన తరువాతే ఈ చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఎన్డీఏ నుంచి.
ఇటీవలే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తు విషయంపై చర్చించారు. సీట్ల పంపకాలపైనా తుది నిర్ణయాలను తీసుకున్నారు. బీజేపీకి కేటాయించాల్సిన సీట్లపై చంద్రబాబు నుంచి స్పష్టత తీసుకున్నారు. అనంతరం ఎన్డీఏలో చేరికకు అంగీకరించారు అమిత్ షా, జేపీ నడ్డా.
బీజేపీ- తెలుగుదేశం పొత్తు కుదిరిన మరుసటి రోజే.. బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది యాదృచ్చికమే. ఈ నెల 10వ తేదీన అద్దంకి వద్ద సిద్ధం బహిరంగ సభను నిర్వహించాలని ఇదివరకే వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది.

టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తు అనంతరం రాష్ట్రంలో శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలు సిద్ధం బహిరంగ సభను మరింత ఆసక్తికరంగా మార్చివేశాయి. అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. ఈ పొత్తుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉండబోతోందనేది సిద్ధం సభలో స్పష్టం కానుంది.
నిజానికి- కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైఎస్ జగన్ ఎప్పుడూ ఘర్షణ వైఖరికి వెళ్లలేదు. సఖ్యతగానే మెలిగారు. పలు కీలక బిల్లుల విషయంలో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కేంద్రానికి అండదండగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీపై జగన్ స్వరం ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది.
ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే కదన రంగంలోకి దిగబోతోంది. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఎదుర్కొనబోతోంది. ఏ పార్టీతో కూడా గతంలో తాము పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులో కూడా ఆ పరిస్థితి రానివ్వబోనంటూ వైఎస్ జగన్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. తన పార్టీ కార్యకర్తలను మరో జెండా మోయనివ్వబోనంటూ తేల్చి చెప్పారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications