టీటీడీకి రిలయన్స్ భారీ కానుక- బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయి అందుబాటులో..

దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ కానుకను అందించనుంది. మొత్తం 25 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను విరాళంగా ఇవ్వబోతోంది. దశలవారీగా బ్రహ్మోత్సవాల నాటికి ఆయా బస్సులన్నీ కూడా టీటీడీకి అందబోతోన్నాయి. ఈ క్రమంలో వాటిని నడిపించడానికి అవసరమైన ఏర్పాట్లపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన ఛార్జింగ్ స్టేష‌న్, ప‌వ‌ర్ సప్లై, డ్రైవ‌ర్లు, వివిధ మౌలిక స‌దుపాయాల ఏర్పాటుపై రిల‌య‌న్స్ ప్ర‌తినిధుల‌తో ఆయన సమావేశం అయ్యారు. తిరుమ‌ల‌ ప‌ద్మావ‌తి అతిథి గృహంలో ఈ భేటీ ఏర్పాటైంది. రిల‌య‌న్స్ విరాళంగా అందిస్తోన్న ఎల‌క్ట్రిక్ బ‌స్సులను భ‌క్తుల‌కు పూర్తిస్థాయిలో ఉప‌యోగ‌ప‌డేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

TTD Reviews Electric Bus Setup with Charging Stations and Power Supply to Be Secured Optimum Use

మొత్తం 50 బ‌స్సుల సామ‌ర్థ్యంతో ఛార్జింగ్ స్టేష‌న్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకేసారి 20 బ‌స్సులు ఛార్జింగ్ అయ్యేలా ఛార్జింగ్ పాయింట్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని రిల‌య‌న్స్ ప్రతినిధులను కోరారు. 30 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉండేలా బస్సులను రూపొందించాలని, ఒక్కో దాంట్లో 50 మంది ప్ర‌యాణించేలా తయారు చేయాలని సూచించారు.

బ‌స్సులు త్వ‌రగా ఛార్జింగ్ అయ్యేందుకు వీలుగా రెండు మెగా వాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల‌ని వెంకయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారాయన. బ‌స్సులను న‌డిపేందుకు 50 మంది డ్రైవ‌ర్ల‌ను సిద్ధం చేసుకోవాల‌ని చెప్పారు. ప్ర‌తి రెండు నిమిషాల‌కు ఒక బ‌స్సు అందుబాటులో ఉండేలా ఒక షిఫ్టుకు 25 బ‌స్సుల లెక్క‌న‌ రెండు షిఫ్టుల్లో 50 బ‌స్సులు తిప్పేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు.

బ‌స్సుల పార్కింగ్ కోసం త‌గిన స్థ‌లాన్ని గుర్తించి రిల‌య‌న్స్ సంస్థ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించాలని, త్వ‌రిత‌గ‌తిన పూర్తిస్థాయి ఛార్జింగ్ స్టేష‌న్ అందుబాటులోకి వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అన్నారు. అదేవిధంగా బ‌స్సులో అధునాత‌న ప్ర‌యాణికుల స‌మాచార వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసి రాబోయే బ‌స్టాప్ ల వివ‌రాలు భ‌క్తుల‌కు తెలిసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చేప‌ట్టాల‌ని చెప్పారు. ప్రస్తుతం ఇటువంటి వ్యవస్థ టీటీడీలో అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+