సోమిరెడ్డి దీక్షకు హిజ్రాల్ని పంపుతారా ? వాళ్లకే టికెట్లు ! టీడీపీ నేత ఆనం సెటైర్లు..!
నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ ను అడ్డుకునేందుకు టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన దీక్షను అడ్డుకునేందుకు హిజ్రాలు రావడం సంచలనం రేపింది. సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసే లక్ష్యంతో వైసీపీ పంపిన హిజ్రాల వ్యవహారంపై ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. రాజకీయ నేతల దీక్షల్ని అడ్డుకునేందుకు ఇలా హిజ్రాల్ని కూడా పంపుతారా అని జనం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు వైసీపీ తీరుపై మండిపడుతున్నారు.
సోమిరెడ్డి దీక్షను అడ్డుకునందుకు వైసీపీ సర్కార్ హిజ్రాలను పంపడంపై నెల్లూరు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత ఆనం ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో మగాళ్లు లేరని.. టీడీపీలో దమ్ముండే నేతలని ఎదుర్కోలేక హిజ్రాలని పంపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దీక్ష చేస్తున్న సమయంలో హిజ్రాలను పంపడం హేయమైన చర్య అని చెప్పారు. టీడీపీ నేతలపై దాడులు చేస్తే చూస్తు ఊరుకోమని ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ నేతల్ని తీవ్రంగా హెచ్చరించారు.

సోమిరెడ్డి దీక్ష సందర్భంగా వచ్చిన హిజ్రాలు ఆయన్ను ఏమీ చేయకుండా మాట్లాడి వెళ్లిపోవడంతో ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. హిజ్రాలతో సోమిరెడ్డి మాట్లాడి పంపించేశారు. అయితే తన దీక్షకు హిజ్రాల్ని పంపడంపై సోమిరెడ్డితో పాటు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు కూడా ఇవ్వాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎన్నికలకు భయపడే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆయన విమర్శించారు. నెల్లూరు జిల్లాలోనూ ఈ హిజ్రాల వ్యవహారం చర్చనీయాశంగా మారింది.
Ycp పార్టీ లో మగవాళ్ళు లేరా? pic.twitter.com/L00NGms5vE
— Anam Venkata Ramana Reddy (@anamramana) December 19, 2023












Click it and Unblock the Notifications