మీరు జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని ఢిల్లీ టాక్... విజయసాయిపై అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్

టీడీపీ,వైసీపీ నేతల మధ్య ట్విట్టర్‌ వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ సీఎం చంద్రబాబు స్టే కోసం ప్రయత్నాలు చేస్తుండటం పట్ల వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు చంద్రం... అసలు చట్టం ముందు నిలబడే దమ్ముందా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

విజయసాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై అంతే ఘాటుగా స్పందించారు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. 'ట్విట్టర్‌లో పిచ్చి కూతలు కూసే బదులు మీ వెనుకున్న మురికిని చూసుకోండి సాయిరెడ్డి గారు... 10 ఏళ్ల నుంచి మీ దొంగ లెక్కల కేసును తేల్చమని మోదీని ఎందుకు అడగడం లేదు. రెండేళ్ల నుంచి మూతి నొప్పని, ముడ్డి నొప్పని శుక్రవారం విచారణను ఎగ్గొట్టే జగ్గడు, నువ్వూ ఇంకొకరి గురించి చెప్పటమా?.. ముందు మీ కేసుల విచారణ గురించి ఆలోచించు. మీరు జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని ఢిల్లీ టాక్ అని చెప్పారు.'అని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.

tdp leader atchannaidu counter attack on twitter over vijayasai reddy comments

అంతకుముందు విజయసాయి రెడ్డి.. 'సిగ్గు లేకుండా వందోసారి స్టే కోసం ప్రయత్నం. ప్రజాకోర్టులో ఇంకా ఘోరమైన శిక్షలు తప్పవు. ఎమ్మెల్యే గానూ నీకు ఓటమి తప్పదు. నీకు ఇల్లే జైలు అయిపోతుంది. నీ మానిప్యులేషన్, మీడియా రాజకీయాలు నడవవు.YSCP పాలనలో అక్రమాలు, అరాచకాలంటూ రోజూ ప్రెస్ మీట్లు, పచ్చ మీడియాలో డిబేట్లు. రెండేళ్లలో TDP ఓటింగ్ 10 శాతం తగ్గింది. 39 నుంచి 29కి పడింది. బాబు పార్టనర్ జనసేనకు 6 నుంచి 4కు చేరింది.' అని పేర్కొన్నారు. విజయసాయి చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అచ్చెన్న స్పందించారు.

కాగా,అమరావతిలో అసైన్డ్ భూముల కేసు చంద్రబాబు మెడకు వేలాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు అందాయి. ఈ వ్యవహారంపై సీఐడీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మొదట సీఐడీ విచారించింది. ఈ నెల 23న చంద్రబాబును కూడా విచారించనున్న నేపథ్యంలో కోర్టులో స్టే కోసం ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+