వైఎస్ జగన్ పై రాయి విసిరింది అతడేనా ?
ఏపీలో ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్ పై విజయవాడలో జరిగిన రాయి దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో బస్సు యాత్ర చేస్తున్న జగన్ పై పదునైన రాయి విసరడం భద్రతా లోపాల్ని బయటపెట్టింది. హైటెన్షన్ వైర్లు తగులుతాయన్న కారణంతో జగన్ బస్సు యాత్ర జరుగుతున్న ప్రాంతంలో కరెంటు నిలివేయడం, అదే అదనుగా ఆగంతకులు రాయి విసరడం, జగన్ గాయం పాలవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అసలు రాయి విసిరింది ఎవరన్న దానిపై స్ధానికంగా ఓ ప్రచారం జరుగుతోంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్ బస్సు యాత్ర సందర్భంగా ఆయనపై రాయి దాడి జరిగింది. దీనికి స్ధానికంగా ఉండే ఓ రౌడీ షీటర్ కారణమన్న ప్రచారం జరుగుతోంది. వంకా శ్రీను అనే రౌడీ షీటరే ఈ దాడికి పాల్పడినట్లు సెంట్రల్ సీటులో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పై దాడికి వైసీపీ నేతలు కేశినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ సూత్రధారులని బోండా ఆరోపించారు.

సానుభూతి కోసం చంద్రబాబుపై,ఇక్కడ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనపై నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఎంపై దాడి కేసు విచారణ సీబీఐకి ఇవ్వాలన్నారు. సీబీఐ విచారణ జరపాలని సాయంత్రం గవర్నర్ ను కలుస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications