పిన్నెల్లి కాదు పిల్లి-మూతి మీద మీసం ఉంటే రమ్మని బుద్ధా సవాల్..!
నాలుగేళ్ల క్రితం పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలపై జరిగిన దాడికి సంబంధించి ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న ఇవాళ జిల్లా అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసారు. అప్పట్లో తమపై వైసీపీ నేతలు దాడి చేసినట్లు ఆధారాలు ఉన్నా తమ ఫిర్యాదుల్ని పోలీసులు పట్టించుకోలేదన్నారు. కాబట్టి ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నట్లు బుద్దా వెంకన్న తెలిపారు. అప్పట్లో మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు కలిసి తనతో పాటు పార్టీ నేత బోండా ఉమపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమపై అప్పట్లో పిన్నెల్లి బ్రదర్స్ ఆకారణంగా దాడి చేశారని గుర్తుచేశారు. ఈ దాడి లో పాత్రధారి తురకా కిషోర్ అయితే సూత్రధారి పిన్నెల్లి అన్నారు. వీరు తమ కారుపై పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి దాడి చేసినట్లు తెలిపారు. తమపై దాడి చేసిన వారికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడానికి మాపై దాడి ఒక సంకేతం అని బుద్దా ఆరోపించారు.

మాచర్లని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పిన్నెల్లి తయారు చేశారని బుద్దా విమర్శించారు. తమపై దాడి చేసినప్పుడు ఏ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అధికారం ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని లేకపోతే పిల్లి రామకృష్ణారెడ్డి అని బుద్దా ఎద్దేవా చేశారు. తమను చంపడానికి పిన్నెల్లి పధకం వేశారని, తనపై దాడి కేసులో పిన్నెల్లి మొదటి ముద్దాయి అని వెల్లడించారు. నీకు మూతి మీద మీసం ఉంటే సరే చూసుకుందాం అంటూ పిన్నెల్లికి బుద్దా సవాల్ విసిరారు. అన్ని ఆలోచించే ఈ కేసు పెట్టానన్నారు. ఈ కేసులో నీకు శిక్ష పడే వరకూ పోరాడుతానంటూ బుద్దా హెచ్చరించారు.
అధికారం ఉంది కాబట్టి అప్పుడు పిన్నెల్లి తప్పించుకున్నాడని, తనపై దాడి చేసి ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా వారే బయటకు వదిలారని బుద్దా గుర్తుచేశారు. ఎస్పీకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పవర్ ఉంటే ఒకలా పవర్ లేకపోతే ఒకలా ఉంటారన్నారు. పిన్నెల్లి అనే వాడు ఒక పిల్లి లాంటోడన్నారు. ఒక మంచి పని కోసం తమను చంద్రబాబు మాచర్లకి పంపారని అప్పటి ఘటనను గుర్తుచేసుకున్నారు. పిన్నెల్లి బ్రదర్స్ ప్రజాస్వామ్యoలో తిరగడానికి అనర్హుడన్నారు. పిన్నెల్లి దుర్మాగ్వాలను ఇప్పటికైనా పూర్తిగా అణచివేయాలని పోలీసుల్ని కోరారు.












Click it and Unblock the Notifications