ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే..! బుద్దా వెంకన్న జోస్యం..

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల శాతం కూడా తేలిపోయింది. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఇవాళ ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు ఎవరిదన్న అంశంపై రాష్ట్రంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇందులో కొందరు వైసీపీకి తిరిగి అధికారం లభిస్తుందని, మరికొందరు లేదు ఎన్డీయే కూటమి కచ్చితంగా గెలుస్తుందని విశ్లేషణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తన జోస్యం చెప్పారు.

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 130 సీట్లకుపైగా గెలువబోతోందని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. పోలింగ్ రోజు అర్ధరాత్రి వరకు ఓటర్లు బారులు తీరడమే దీనికి ఉదాహరణ అన్నారు. ప్రభుత్వంపై ఉన్న కక్షతోనే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటు వేశారన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని ప్రజలు గుర్తించారని బుద్ధా తెలిపారు. చంద్రబాబు నాలుగోసారి సీఎంగా అమరావతిలో ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన వెల్లడించారు.

tdp leader budha venkanna s prediction on nda winning seats in ap

వైసీపీ ని ఓడించేందుకు నారా కుటుంబం రోడ్డుపైకి వచ్చిందని బుద్ధా వెంకన్న తెలిపారు. మంత్రి బొత్స సతీమణి ఝాన్సీ కూడా ఎంపీగా ఓడిపోతున్నారని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న బుద్ధా వెల్లడించారు. ఫలితాలు వచ్చేలోపు అధికారులను భయపెట్టాలని మంత్రి బొత్స మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికే పోలింగ్ పూర్తయిందని, ఇలాంటి వ్యాఖ్యల వల్ల మారేదేమీ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+