అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నో వేకెన్సీ: క్రాస్ రోడ్స్ లో 'గంటా'?

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటినుంచి సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి విజయం సాధించినప్పటికీ అక్కడికి దూరంగా ఉంటున్నారు. ఆయన సన్నిహితులు కొందరు గంటా తరఫున పనులు చక్కబెడుతున్నారు. టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ లోకేష్ తో సుదీర్ఘభేటీద్వారా వాటిని ఖండించినట్లైంది.

 ఎక్కడి నుంచి పోటీచేయాలనేది గందరగోళమే

ఎక్కడి నుంచి పోటీచేయాలనేది గందరగోళమే


గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ గెలిచే పార్టీలోనే ఉంటారనే విమర్శ ఉంది. తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకోవడంవల్ల ఈ కూటమికి విజయావకాశాలుంటాయనే అంచనాతోనే టీడీపీలోనే కొనసాగుతున్నరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్తగా గంటాకు మరొక చిక్కు వచ్చిపడింది. ప్రతి ఎన్నిక సందర్భంగా నియోజకవర్గాన్ని మార్చే గంటా శ్రీనివాసరావుకు ఈసారి ఎక్కడినుంచి పోటీచేయాలనే విషయం గందరగోళంగా మారింది. యలమంచిలి, గాజువాక, భీమిలీ, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేయాలనుకుంటున్నారు.

గంటా కోరుతున్నవే కోరుతున్న జనసేన

గంటా కోరుతున్నవే కోరుతున్న జనసేన


కానీ జనసేనతో పొత్తు కుదరబోతున్న నేపథ్యంలో గంటా పోటీచేయాలనుకుంటున్న నియోజకవర్గాలన్నింటినీ పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని జనసేన కోరుతోంది. దీంతో గంటాకు ఎటూ పాలుపోవడంలేదు. వచ్చే ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీచేయడానికి ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి పైన పేర్కొన్న నియోజకవర్గాల్లో సరైన హామీ లభించలేదని తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన రెండూ బలంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో అభిమానుల బలం ఎక్కువగా ఉండటంతో కేటాయించే నియోజకవర్గాలను కూడా తనకు బలమున్న జిల్లాల్లోనే కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది.

నియోజకవర్గమే దొరకని పరిస్థితి

నియోజకవర్గమే దొరకని పరిస్థితి


దీంతో గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ రాజకీయవేత్తకు కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేయడానికి నియోజకవర్గం దొరకని పరిస్థితి క్రియేటైందంటే అతిశయోక్తి కాదు. తెలుగుదేశం పార్టీతో ఏర్పడిన అంతరాన్ని గంటా తగ్గించుకోవాలనుకుంటున్నారు. నారా లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. దీనివల్ల పార్టీ అతన్ని చేరదీస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు పార్టీలో కొన్ని బురద పాములు ఉన్నాయని, అలాంటి పాములను దగ్గరకు చేరనీయవద్దని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించడమే కాకుండా హై కమాండ్ కు కూడా సూచించారు. ఇటువంటి పరిణామాల మధ్య గంటా రాజకీయం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

English summary
It is known that Telugu Desam Party leader and former minister Ganta Srinivasa Rao has been silent since the formation of the YS Jagan government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X