“కోకో కోలా పెప్సీ జగనన్న ట్యాక్స్ సెక్సీ”:గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాట్ ట్వీట్
ఏపీలో ఇప్పుడు సినిమా టికెట్ల తగ్గింపు వ్యవహారం హాట్ టాపిక్.. భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ సందర్భంగా టికెట్ల రేట్లను పెంచబోమని.. బెనిఫిట్ షో ఉండదని, 5వ షోకు అనుమతి లేదని జగన్ సర్కార్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు, జనసేన నేతలు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఇవాళ మరొ కొత్త అంశాన్ని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీసుకువచ్చారు. జగన్ ప్రభుత్వంపై ప్రశ్న సంధించారు.

కావాలనే చేసి..
భీమ్లా నాయక్ సినిమాను ఉద్దేశపూర్వకంగానే వైసీపీ సర్కారు అడ్డుకుంటోందని టీడీపీ ఆరోపిస్తోంది. జన సైనికులు అయితే మరింత ముందుకు వెళ్లి వినూత్న నిరసనలకు దిగుతున్నారు. టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివాదంపై తనదైన శైలిలో జగన్ సర్కారు తీరుపై ఓ మాస్ ట్వీట్ చేశారు. "కోకో కోలా పెప్సీ జగనన్న ట్యాక్స్ సెక్సీ" పేరుతో ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.
మరీ దీని సంగతెంటీ..?
జగన్ సర్కారు తీరుతో సినిమా థియేటర్ల వద్ద నెలకొన్న పరిస్థితిని ప్రస్తావిస్తూ ఓ జగన్ అభిమాని మాదిరిగా ఈ ట్వీట్‌ను బుచ్చయ్య వేశారు. 'అయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాన్ని గుర్తించి సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించారు సంతోషం. మరి ఇంకో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకో కష్టం వచ్చింది.అది సినిమా మధ్యలో దాహం వేస్తే మన ప్రభుత్వం మే కదా డ్రింక్ బాటిల్ కొనుక్కుని తాగుదామంటే ఆ బిల్లు చూసి గుండె జల్లు మంటుంది.. జేబుకి చిల్లు పడుతుంది. టికెట్లు రేట్ 20 అయితే డ్రింక్ రేటు 150 ఉంది.. బయట ఏమో 40 రూపాయిలు ఉంటుంది..అన్న జగనన్న...అని గట్టిగా పిలవాలని అనిపించింది..కానీ మధ్య లో పేర్ని నాని గారు గుర్తుకు వచ్చారు' అని ట్వీట్ చేశారు.
జగనన్న తడాఖా ఏంటో చూపుతాం
మరో ట్వీట్‌లో 'సరే అదంతా కాదు జగనన్న తడాఖా ఏంటో చూపిస్తాం అని షాపు వాడికి చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టా.. ఈ విషయాన్ని పట్టించుకోగల సత్తా..దమ్ము ధైర్యం..మా జగనన్నకే ఉంది.. ఉంటుంది...అన్న J ట్యాక్స్ ఎలా ఉంది అంటే ఇడ్లి 2 రూపాయిలు చెట్నీ 10 రూపాయిలు అన్నట్లు ఉంది...నువ్వు ఈ సమస్య ని పరిష్కరిస్తావు...తప్పకుండా.. అది కూడా అంతః కరణ శుద్ధి తో...మీ పేరు ysjagan పేరు ప్రఖ్యాతలు దేశం నలుమూలల వ్యాప్తి చెందాలని కోరుకుంటూ...ఆ బాబాయ్ దీవెనలు మనకి ఉండాలని...కోరుకుంటున్నాను' అని బుచ్చయ్య ఓ రేంజిలో ట్వీట్ చేశారు.

రియాక్షన్
మరీ దీనిపై వైసీపీ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. జగన్ ప్రభుత్వంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి డైరెక్టుగా అటాక్ చేశారు. మరీ ఇప్పుడు అధికార పార్టీ ఎలా కవర్ చేస్తుందో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications