
ఈడీ విచారణకు జేసీ ప్రభాకరరెడ్డి - ఆగ్రహం తో ఊగిపోతూ..!!
టీడీపీ నేత..తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ ముందు హాజరయ్యారు. ఆయన నిర్వహిస్తున్న బస్సుల కంపెనీ ప్రతినిధులు ఈడీ ముందుకు వచ్చారు.కొద్ది నెలల క్రితం ఈడీ అధికారులు జేసీ బ్రదర్స్ తో పాటుగా వారి ముఖ్య అనుచరుడు - కాంట్రాక్టర్ గా ఉన్న గోపాల్ రెడ్డి ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై సోదాలు జరిగాయి. స్క్రాప్ కింద బస్సులు కొనుగోలు చేసి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసి ఏపీలో నడపడం పైన గతంలో కేసు నమోదైంది.

రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కేసు
ఒక్క బస్సు కోసం రిజిస్ట్రేషన్ చేయటం..దాని మీదనే పలు బస్సులు నడపడం వంటి ఆరోపణలతో గతంలో జేసీ బ్రదర్స్ పై కేసులు నమోదయ్యాయి. అలాగే కొన్ని వాహనాలను అప్ గ్రేడ్ చేసినట్లు పత్రాలు సృష్టించారన్న ఆరోపణలు కూడా జేసీ బ్రదర్స్ మీద ఉన్నాయి. ప్రధానంగా బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 మార్చి రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారని కేసు నమోదైంది. దీని మీద ఈడీ అధికారులు తమ ముందు పూర్తి సమాచారంతో విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే నోటీసులు జారీ చేసారు. కొద్ది కాలం క్రితమే జేసీ కుటుంబం తమ ప్రయివేటు బస్సుల వ్యాపారాన్ని నిలిపివేసింది.

ఈడీ ముందు హాజరు
ఇప్పుడు
తాజాగా
ఈడీ
కార్యాలయంలో
జేసీ
ప్రభాకర్
రెడ్డి
తన
సిబ్బందితో
కలిసి
హాజరు
కావటం
రాజకీయంగా
ఆసక్తి
కరంగా
మారింది.
అయితే,
తమ
మీద
దొంగ
కేసులు
పెట్టారని..వాటి
పైన
ఈడీ
విచారణ
సాగుతోందని
చెప్పారు.
అవి
దొంగ
కేసులని
తెలియక
ఈడీ
విచారిస్తోందని
వ్యాఖ్యానించారు.
నాగాలాండ్
లో
కొనుగోలు
చేసిన
బస్సులకు
సంబంధించి
ఈ
మార్పులు
చేసినట్లుగా
ఫిర్యాదులు
ఉన్నాయి.
ఇప్పటికే
జేసీకి
చెందిన
కంపెనీ
పైన
ఈడీ
కేసు
నమోదు
చేసింది.

సీఎం కుటుంబ మీడియా పై సీరియస్
తాము
ఈ
కేసులకు
భయపడేది
లేదని
ప్రభాకర్
రెడ్డి
వ్యాఖ్యానించారు.
ఈడీ
దాదాపుగా
నాలుగు
గంటల
పాటు
ప్రభాకర
రెడ్డిని
విచారించినట్లు
తెలుస్తోంది.
జేసీ
ప్రభాకర్
రెడ్డి
ఈడీ
కార్యాలయం
వద్ద
ఏపీ
సీఎం
జగన్
కుటుంబానికి
చెందిన
మీడియా
ప్రతినిధి
పైన
ఆగ్రహంతో
ఊగిపోయారు.
నీవే
పెట్టావు
కదా
కేసులు
అంటూ
గట్టిగా
మాట్లాడారు.పక్కకు
పో
అంటూ
ఆ
ఛానల్
లోగోను
పక్కను
నెట్టారు.
భయపడతాం
అనుకుంటున్నావా
అంటూ
ప్రశ్నించారు.