కేశినేని నానికి చిన్ని ఛాలెంజ్ - ధైర్యం ఉందా..!!

విజయవాడ కేంద్రంగా రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైసీపీ నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని చెప్పారు. పార్టీ వీడిన నాని లక్ష్యంగా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా నాని సోదరుడు..టీడీపీ నేత కేశినేని చిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. నానికి దమ్ము ధైర్యం ఉంటే తనతో పోటీ పడాలని..నానికి డిపాజిట్లు రాకుండా చేస్తామని హెచ్చరించారు.

నానికి సవాల్:ఎంపీ కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్దిగా వైసీపీ ప్రకటించింది. వైసీపీలో చేరిన నాని ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. వీటి పైన విజయవాడ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ నుంచి తనను అవమానించి వెల్లగొట్టారని నాని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో నాని వ్యాఖ్యల పైన కేశినేని చిన్ని స్పందించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నాని కి లేదని పేర్కొన్నారు. నాని పైన పోటీ చేసే టీడీపీ అభ్యర్దిని మూడు లక్షల మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేసారు. దమ్ముంటే తనతో పోటీ పడాలని సవాల్ చేసారు. వైసీపీ నుంచి సీటు తెచ్చుకున్న తరువాత నాని మాట్లాడాలని ఫైర్ అయ్యారు.

TDP leader Kesineni Chinni open challenge for Kesineni Nani leads to political heat in Vijayawada

మార్పులు - చేర్పులు:వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుతో సీటు రాని నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి విష్ణును తప్పించి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కేటాయించారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి టీడీపీ నుంచి పోటీకి సిద్దమవుతున్నారు. పార్ధసారధికి నూజివీడు సీటు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నూజివీడు నేతలతో పార్ధసారధి సహకారం కోరుతూ కలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మైలవరం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత పార్టీలో ఉంటారా.. లేక మారుతారా అనే సందేహం కొనసాగుతోంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్ ను పెనమలూరుకు మార్చారు. ఇప్పుడు వసంత పార్టీ వీడితే తిరిగి ఆ స్ధానం జోగి రమేష్ కు ఇస్తారనే చర్చ వైసీపీ వర్గాల్లో కొనసాగుతోంది.

జాబితా సిద్దం:మచిలీపట్నం ఎంపీగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును పోటీకి దింపాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటు టీడీపీలోనూ జిల్లాలో సీట్ల ఖరారు పైన తుది కసరత్తు జరుగుతోంది. వైసీపీ నుంచి పార్టీలో చేరనున్న నేతలకు అవకాశం కల్పించటం పైన మంత్రాంగం సాగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల తొలి వారంలోనే ఇప్పటి వరకు క్లియర్ చేసిన స్థానాలకు అభ్యర్దులతో తొలి జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో విజయవాడ ఎంపీ అభ్యర్దిగా కేశినేని చిన్ని పేరు ఖాయమని చెబుతున్నారు. మచిలీపట్నం ఎంపీగా జనసేనకు అవకాశం ఇస్తారని సమాచారం. వైసీపీ నుంచి ఎంపీగా ఉంటూ జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి పేరు ప్రచారంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+