వాలంటీర్ల పై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు - ఇదీ నిజస్వరూపం..!!
ఏపీలో ఇప్పుడు వాలంటీర్లు..పెన్షన్ల వ్యవహారం పైన రాజకీయ వివాదం కొనసాగుతోంది. చంద్రబాబు కారణంగానే పెన్షనర్లకు ఇంటికి వచ్చి అందించే వాలంటీర్ల పైన ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిందని వైసీపీ ఆరోపిస్తోంది. తమ తప్పు లేదని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పాలని..వైసీపీ రాజకీయం చేస్తోందని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. ఈ సమయంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. దీని పైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు.
వాలంటీర్ల రాజీనామాలు
వాలంటీర్లు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను ఈసీ దూరం పెట్టింది. దీంతో మున్సిపల్ కమిషనర్‌కు.. అలాగే గ్రామ సచివాలయాల్లోనూ వలంటీర్లు రాజీనామాలను అందిస్తున్నారు.

నియోజకవర్గంలో మొత్తం 1200 పైబడి వలంటీర్లు సేవలందిస్తున్నారు. ఇక రాజీనామా లేఖలో వలంటీర్లు పేర్కొన్న అంశాలు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులకు అందిస్తూ గత 50 నెలలుగా నిస్వార్ధ సేవలందిస్తున్నామన్నారు. ఎటువంటి రాజకీయాలకూ ప్రభావితం కాకుండా సేవలందిస్తున్నామని తెలిపారు.
కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు
కొంతమంది తమ సేవలకు రాజకీయాలు ఆపాదించి తమపై ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు. దీనికి తామంతా మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నామని వలంటీర్లు చెప్పుకొచ్చారు. వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూకుమ్మడి రాజీనామాలతో వలంటీర్ల నిజస్వరూపం బయట పడిందన్నారు. వలంటీర్లను తొలగించమని ఈసీ చెప్పలేదన్నారు. కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే వలంటీర్లను దూరం పెట్టిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా వలంటీర్లను కొనసాగిస్తామన్నారే గానీ తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు.

రాజకీయ దుమారంగా
కేవలం ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా వాలంటీర్లను వాడుకునేందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయిస్తున్నారని విమర్శించారు. రాజీనామాలు చేయాలని స్థానిక వైసీపీ నేతలు వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చారన్నారు. ప్రత్యేక ఫార్మెట్ తయారు చేసి ఆ ఫార్మెట్ ప్రకారం రాజీనామాలు చేయిస్తున్నారన్నారు. వలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దని అధికారులను కోరుతున్నామన్నారు.
ఈసీ కూడా దీనిపై దృష్టి పెట్టి మూకుమ్మడి రాజీనామాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కొల్లు రవీంద్ర కోరారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయంలో వాలంటీర్లు..పెన్షన్ల ఆలస్యం వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారంగా మారుతోంది. ఓట్లు నష్టపోతామా అనే టెన్షన్ మొదలైంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications