జగన్ సర్కార్ కేబినెట్ అజెండాను నారా లోకేష్ ఫిక్స్ చేశారా?: ఆత్మలతో మాట్లాడ్డం ఆపి..!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్.. సృష్టించిన రాజకీయ దుమారం ఇంకా చల్లారట్లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దీనిపై మరింత రచ్చ చేస్తోంది. జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోన్న ఆ పార్టీ నాయకులు మరో అడుగు ముందుకేశారు. ఈ ఉదయం ప్రారంభం కాబోతోన్న మంత్రివర్గ సమావేశంలో దీన్ని అజెండాగా చేర్చాలని సూచించారు. మంత్రివర్గ భేటీ సందర్భంగా జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని అంటోన్నారు.
Recommended Video
కొద్దిసేపటి కిందటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ట్వీట్లు చేశారు. అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి వేయాలని నారా లోకేష్ సూచించారు. సహచర మంత్రులు, అధికారులతో మాట్లాడితే కొంతవరకైనా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను నిలువునా ముంచేసిన జాబ్‌లెస్ క్యాలెండర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

దానికి బదులుగా కొత్త క్యాలెండర్‌ను రూపొందిస్తూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కనీసం 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామంటూ అప్పట్లో పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీకి అనుగుణంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మలతో కాకుండా అంతరాత్మతో మాట్లాడాలని నారా లోకేష్ అన్నారు. మంత్రివర్గ సమావేశం సందర్భంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసేలా నిర్ణయాలను తీసుకుంటారని తాను ఆశిస్తున్నాన్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications