ఏపీలో మళ్లీ తెరపైకి ఆ కీలక డిమాండ్-గతంలో బాబుకు..ఇప్పుడు కేంద్రం, జగన్ కూ సంకటం ?

ఏపీ విభజన హామీల్లో ఒకటైన ఆ కీలక డిమాండ్ ను తెరపైకి తీసుకురావడం ద్వారా గతంలో తమను అధికారానికి దూరం చేసిన వైఎస్ జగన్ ను అదే తరహాలో ఇరుకునపెట్టేందుకు నారా లోకేష్ సిద్ధమవుతున్నారు.

ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ గడప గడపకూ ప్రభుత్వంతో జనంలోకి వెళ్తుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, కుమారుడు లోకేష్ వరుస టార్లు, పాదయాత్రలతో హల్ చల్ చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఏప్రిల్ నుంచి వారాహితో జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గతంలో చంద్రబాబు సర్కార్ ను ఇంటికి పంపిన ఓ కీలక డిమాండ్ తెరపైకి వస్తుండటం వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగించబోతోంది.

జగన్ వర్సెస్ విపక్షాల పాలిటిక్స్

జగన్ వర్సెస్ విపక్షాల పాలిటిక్స్


ఏపీ రాజకీయాలు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ క్లారిటీ వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో జగన్ వర్సెస్ విపక్షాల మధ్య భారీ పోరు తప్పదనే సంకేతాల్ని తాజా పరిణామాలు ఇచ్చేస్తున్నాయి. రాజధానితో మొదలుపెట్టి పలు అంశాల్లో ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్న విపక్షాలు.. జగన్ పై కత్తులు దూస్తున్నాయి. దీంతో జగన్ కూడా తాను నాలుగేళ్లలో అమలుచేసిన సంక్షేమాన్ని పదే పదే ప్రస్తావిస్తూ జనంలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ పాత డిమాండ్ ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఎన్నికల నాటికి అది కచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా కనిపిస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్

ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా డిమాండ్ మరోసారి తెరపైకి వస్తోంది. పాతిక మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చిన జగన్.. ఆ దిశగా కేంద్రం మెడలు వంచారా, 22 మందే ఇచ్చారు కాబట్టి మౌనంగా ఉండిపోతున్నారా, కేంద్రానికి వైసీపీ బలంతో పనిలేకుండా పోవడంతో తాను విఫలమైనట్లు చెప్పుకోబోతున్నారా అనేది కాస్త పక్కనబెడితే ఎన్నికలకు ముందు విపక్షాలు మాత్రం ఈ డిమాండ్ తోనే జగన్ సర్కార్ ను, కేంద్రాన్ని టార్గెట్ చేయబోతున్నాయి. ఈ దిశగా తొలి అడుగు పడింది.

హోదా కోసం ప్రశ్నించాలన్న లోకేష్

హోదా కోసం ప్రశ్నించాలన్న లోకేష్

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం ఎలాగో మౌనంగానే ఉంటోంది. దీంతో రాష్ట్రం కూడా సైలెంట్ అయిపోయింది. అడిగితే ముగిసిన అధ్యాయం అంటూ కేంద్రం జవాబిస్తోంది. కానీ రాష్ట్రం ఆ మాట కూడా చెప్పలేని పరిస్ధితి. దీంతో చంద్రబాబు గతంలో ప్యాకేజీ తీసుకోవడంతో హోదా రాకుండా పోయిందని మాత్రమే వైసీపీ సర్కార్, నేలు చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో వైసీపీ నేతల్ని ప్రత్యేక హోదాపై నిలదీయాలని టీడీపీ నేత నారా లోకేష్ తన పాదయాత్రలో కోరుతున్నారు. పాతిక మంది ఎంపీల్ని ఇస్తే హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు 31 మంది ఎంపీలు (లోక్ సభ, రాజ్యసభ కలిపి) ఉన్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని లోకేష్ ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది.

 ఎన్నికల వేళ జగన్ కు సంకటం ?

ఎన్నికల వేళ జగన్ కు సంకటం ?


ప్రస్తుతానికి ప్రత్యేక హోదాపై వైసీపీ చేస్తానన్న పోరాటం చేయలేదన్న అంశం సాధారణ జనంలో మాత్రమే అక్కడక్కడా వినిపిస్తోంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా పాదయాత్రలో అదే అంశాన్ని హైలెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రత్యేక హోదాను ఏం చేశారన్న ప్రశ్న ప్రభుత్వం ముందుకొస్తోంది. ఇప్పటికి చాలా చిన్న విషయంగా కనిపిస్తున్నా.. ఎన్నికల నాటికి ఈ డిమాండ్ కచ్చితంగా ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది. దాంతో పాటే జగన్ నూ, కేంద్రాన్ని ఇబ్బందిపెట్టడం ఖాయం. ఇప్పటికే పార్లమెంటులో హోదాపై ప్రశ్నలు వేస్తున్నా లైట్ తీసుకుంటున్న కేంద్రం.. ఈసారి ఏపీలో రాజకీయం కోసం బీజేపీ చేసే ప్రయత్నాలకు, మరోసారి అధికారం కోసం జగన్ చేసే ప్రయత్నాలకు ఈ డిమాండ్ అడ్డంకిగా మారడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+