రాధాను టచ్ చేస్తే తీవ్ర వరిణామాలు- పరిటాల శ్రీరామ్ హెచ్చరిక
ఏపీలో వంగవీటి రాధా రెక్కీ వార్తలపై మొదలైన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఓవైపు రాధా రెక్కీ ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేయగా.. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయినా ఇది రాజకీయంగా రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీకి చెందిన అనంతపురం నేత పరిటాల శ్రీరామ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
వంగవీటి రాధాను ముట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అనంతపురం టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు.
వంగవీటి రాధాను టచ్ చేసి చూడండి.. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలుస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని 40వ వార్డులో జరిగిన గౌరవ సభలో పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ టీడీపీ నేత వంగవీటి రాధా పై రెక్కీలు నిర్వహించి దాడులు చేయాలని చూస్తున్నారని, వంగవీటి రాధాను టచ్ చేసి చూడండి... పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించారు.
విజయవాడ రాజకీయాల గురించి గతంలో ఎక్కువగా మాట్లాడని పరిటాల శ్రీరామ్ తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు. వంగవీటి రాధా టీడీపీ కుటుంబ సభ్యుడని శ్రీరామ్ చెప్పారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయి. అంతకు పదింతలు మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. వంగవీటి రాధాపై రెక్కీ జరిగిందంటూ వచ్చిన వార్తలపై ఇప్పటికే టీడీపీ నేతలతా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలు ఇప్పటికే రాధాను పరామర్శించారన్నారు.

మరోవైపు రాధా హత్యకు రెక్కీ వ్యవహారంపై విజయవాడ పోలీసులు తాజాగా మరోసారి స్పందించారు. రెక్కీ ఆరోపణలకు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని విజయవాడ పోలీసు కమిషనర్ క్రాంతి రాణా టాటా మరోసారి వెల్లడించారు. అయినా తాము మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని, రాధా చుట్టూ వలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా రాధా ఆరోపణలను తాము ఎంత సీరియస్ గా తీసుకుంటున్నామో వెల్లడించారు. అయినా ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications