వైసీపీ నేత హత్యకు టీడీపీ నేత కుట్ర: బ్రహ్మానందంతో ఒప్పందం..
అయితే హత్య విషయంలో బ్రహ్మానందం మనసు మార్చుకుని వెనక్కి తగ్గడంతో.. ఈ కుట్ర బహిర్గతమైంది.
ఏలూరు: ఏపీలో అధికార-ప్రతిపక్ష పార్టీల నడుమ హత్య రాజకీయాలకు తెరపడటం లేదు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వైసీపీ కార్యకర్తను హత్య చేసేందుకు స్థానిక టీడీపీ నాయకుడు ఒకరు కుట్ర పన్నారు. ఈ కుట్ర భగ్నం కావడంతో.. వైసీపీ నేతకు ప్రాణహాని తప్పినట్లయింది.
దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన వైసీపీ కార్యకర్త కొత్తపల్లి రమేశ్ ను హత్య చేసేందుకు.. స్థానిక టీడీపీ ఎంపీటీసీ శోభన్ బాబు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. రమేశ్‌ను హత్య చేసేందుకు రౌడీ షీటర్ బ్రహ్మానందంతో బేరం కుదుర్చుకుని, రూ.25వేలు ముట్టజెప్పినట్లు సమాచారం.

అయితే హత్య విషయంలో బ్రహ్మానందం మనసు మార్చుకుని వెనక్కి తగ్గడంతో.. ఈ కుట్ర బహిర్గతమైంది. విషయం కాస్త రమేశ్ చెవిన పడటంతో.. అతను తక్షణం పోలీసులను ఆశ్రయించాడు. రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications