అప్పుడే మొదలైన టీడీపీ, జనసేన మధ్య విభేదాలు..పిఠాపురంలో టీడీపీ నేత వర్మపై జనసేన దాడి (వీడియో)
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన నాయకులు ,కార్యకర్తలు కలిసి పని చేశారు. నాయకులు ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి కట్టుగా పని చేయడంతో ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఇది మూడ్నాళ్ల ముచ్చటే అయింది. కూటమి గెలిచి నాలుగు రోజులు కూడా గడవక ముందే ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు టీడీపీ నేతపై దాడికి దిగారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్తలు స్థానిక టీడీపీ నేత అయిన వర్మపై దాడికి యత్నించారు. ఈక్రమంలో ఆయన కారు ధ్వంసం అయింది.
అప్పుడే మొదలైన టీడీపీ, జనసేన మధ్య విభేదాలు..పిఠాపురంలో టీడీపీ నేత వర్మపై జనసేన దాడి..!#SVSNVarma #PawanKalyan #Pithapuram #Janasena #ElectionsResults #APPolitics #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/YUecgXEIzv
— oneindiatelugu (@oneindiatelugu) June 7, 2024
పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు. పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో స్థానిక టీడీపీ నేత వర్మ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ గెలుపుకు కృషి చేశారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికి ఆయన గెలుపు కోసం వర్మ విసృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ సైతం తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నాంటూ వ్యాఖ్యానించారు. అయితే పవన్ గెలిచిన తర్వాత ఎక్కడ కూడా వర్మ పేరు ప్రస్తావించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. ఇదే సమయంలో టీడీపీ నేత వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది.

గొల్లప్రోలు మండలం, వన్నెపూడి గ్రామంలో ఈ ఘటన చేసుకుంది. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే వర్మ కారు పూర్తిగా ధ్వంసమైంది. వర్మ త్యాగానికి సరైన ప్రతిఫలమే ఇచ్చారంటూ టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఈ ఘటనతో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికల సమయంలో కూడా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కానీ నేతలు ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు కలిసి పని చేశారు. అయితే ఇంకా చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే ఇరు పార్టీల విభేదాలు బయటపడటంతో..వీరు ఆరు నెలలైన కలిసి పని చేస్తారా లేదా అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం వర్మపై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications