మ‌న‌సు లేని మ‌నిషి జ‌గ‌న్‌.. ఎప్పటికి మార‌తాడో.. సోమిరెడ్డి విసుర్లు

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని 5 కోట్ల ఆంధ్రులు కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో తిరుపతిలో రైతులు నిర్వహించిన అమరావతి మహోద్యమ సభ చర్చిత్ర సృష్టించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా , కుట్రలు చేసినా, అటంకాలు సృష్టించినా అమరావతివైపే ప్రజలతో పాటు భగవంతుడి అండా నిలిచారని పేర్కొన్నారు.

 అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా..

అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా..


ఆంధ్రుల రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు చేపట్టిన పోరాటానికి వైసీపీ ప్రభుత్వం చేసిన ఆటంకాలు అన్నిఇన్ని కావన్నారు సోమిరెడ్డి. రాష్ట్రంలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతులు, కార్మికులు, యువజన సంఘాలు రాజదాని రైతులకు మద్దతుగా నిలిచాయ‌న్నారు.
సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు సభ వరకు రాష్ట్ర ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు తెలిపి వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు.

 మనసు కరకపోవడం దురదృష్టకరం.

మనసు కరకపోవడం దురదృష్టకరం.

గత రెండేళ్లుగా అమరావతి రెతులు ఆందోళనలు, దీక్ష‌లు చేసినా, నిరసనలు తెలిపినా, వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా సీఎం జగన్ మోహన్ రెడ్డి మనసు మాత్రం కరగ‌లేద‌ని సోమిరెడ్డి విమ‌ర్శించారు. ఇది దౌర్భాగ్యం, దురదృష్టకరమని మండిప‌డ్డారు. ఏం చేస్తే జ‌గ‌న్ మ‌న‌సు మారుతుందో అని ప్రశ్నించారు. మనసు మార్చుకోకపోగా అమరావతి రైతుల ఆందోళనలకు, సభలకు పోటీగా వికేంద్రీకరణ సభలు పెట్టిస్తున్నారని మండిపడ్డిపడ్డారు. ఈ సభల కోసం కాలేజీ యాజమాన్యాలను బెదిరించి విద్యార్థులను తరలిస్తున్నారని ఆరోపించారు.. పాలనపై దృష్టి పెట్టకుండా ఇలాంటి పనులతో రాష్ట్రాన్ని గబ్బుపట్టించడం అవసరమా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

కేంద్రం ప్ర‌భుత్వ‌మే రైతుల‌కు త‌లొగ్గింది..

కేంద్రం ప్ర‌భుత్వ‌మే రైతుల‌కు త‌లొగ్గింది..

కేంద్రంలో అత్యంత శక్తివంతమైన బీజేపీ ప్రభుత్వమే రైతుల పోరాటానికి తలొగ్గిందన్నారు. మూడు వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుందని చెప్పారు. కానీ ఏపీ సీఎం జ‌గ‌న్‌కి మాత్రం మనసు మారడం లేదని దుయ్యబట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనలతో ఏ ప్రాంత ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిదన్నారు. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన జగన్.. ఇప్ప‌టికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకపోతే ప్రజలు క్ష‌మించ‌ర‌ని సోమిరెడ్డి హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+