షాకింగ్... రామ్‌మాధవ్ చేతికి కీలకపత్రాలు: బుగ్గనకు టీడీపీ ఝలక్, స్పీకర్‌కు ఫిర్యాదు
Recommended Video

అమరావతి: పీఏసీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కొత్త ట్విస్ట్. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం టీడీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దానికి కౌంటర్‌గా ఇప్పుడు టీడీపీ నేతలు బుగ్గనపై స్పీకర్‌పై ఫిర్యాదు చేశారు.
బుగ్గన టీడీపీ నేతలపై సభా హక్కుల నోటీసు ఇస్తే, టీడీపీ నేతలు కూడా స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు సంచలన ఆరోపణలు చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బీజేపీ నేత రామ్ మాధవ్‌కు కీలక పత్రాలు అందించారని ఆరోపించారు.

పీఏసీ చైర్మన్‌గా ఆయన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నేతలకు కీలక పత్రాలు అందించారని చెప్పారు. కాబట్టి బుగ్గనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కీలక పత్రాలు అందించడం సరికాదన్నారు. కాగా, బుగ్గనపై ఎస్వీ మోహన్ రెడ్డి, హనుమంతరాయ చౌదరిలు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications