జగన్ తుగ్లక్ 3.0.. మూర్ఖుడు మారాలనుకోవటం అత్యాశే; నారా లోకేష్, టీడీపీ నేతలు ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును ఉపసంహరించుకుంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ, మళ్లీ సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తానని వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు లో ఉన్న లోపాలను సరిదిద్ది, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సమగ్రంగా బిల్లును రూపొందించి అసెంబ్లీలో ప్రవేశ పెడతామని, ప్రస్తుతం చేస్తున్న రద్దు తాత్కాలిక రద్దు మాత్రమేనని పేర్కొన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ తీరుపై వైసీపీ సర్కార్ నిర్ణయాలపై మండిపడుతున్నారు.

మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది : నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం జగన్ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీమంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తుగ్లక్ 3.0 అంటూ అభివర్ణించారు. మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అవుతుందని ఆయన తేల్చి చెప్పారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేసారని లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ తాజా ప్రకటనపై నిప్పులు చెరిగారు.
మూడు రాజధానులకు ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పటం హైలైట్
ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి మూడు రాజధానులు చెయ్యమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అంటూ లోకేష్ జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని అంటూ లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాయమాటలు చెప్పటం అలవాటైపోయింది అంటూ లోకేష్ తేల్చిచెప్పారు. నిర్ణయాలు తీసుకోవడం, మళ్లీ వాటిని వెనక్కి తీసుకోవడం, మళ్లీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా తుగ్లక్ చర్యగా లోకేష్ అభివర్ణించారు.

విశాఖ రాజధాని నిర్ణయం .. భూముల దోపిడీ కోసమే : అయ్యన్న పాత్రుడు
ఇదిలా ఉంటే టిడిపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పై మండిపడ్డారు. సరైన అవగాహన లేకుండా మూడు రాజధానులు బిల్లులు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం మూడు రాజధానులు బిల్లు రద్దుతో మరింత అనిశ్చితి నెలకొందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. విశాఖ రాజధాని పేరుతో విశాఖలో భూములు దోచుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్ రాజధాని ఒకే చోట ఉండాలని, చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయారని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని చట్టం చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.

జగన్ సర్కార్ నిర్ణయంపై మండిపడుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ సర్కార్ నిర్ణయం పై మొదట్నుంచీ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అసలే మూర్ఖుడు ఆ పైన కోర్టు మొట్టికాయలు, ఇప్పుడేమో మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణ చేసుకుంటున్నాము అని కోర్టు కి చెప్పడం చేశారని, మళ్ళీ ఇప్పుడు ఏ భయంకరమైన ఆలోచన చేస్తారో...! ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి పెనం నుండి పొయ్య లో పడినట్లు అవుతుందా... ? అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ అనుమానమే నిజమైంది అని రాజకీయ కక్ష సాధింపు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మూడు రాజధానుల చట్టాన్ని తెచ్చిందని, కోర్టు నుండి మొట్టికాయలు తినాల్సి వస్తుంది అన్న కారణంగా వెనక్కి తీసుకుందని వెల్లడించారు.

అత్యవసరంగా వికేంద్రీకరణ బిల్లుల రద్దు దేనికి ?
లేకపోతే అత్యవసరంగా పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను రద్దు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని గతంలో తమ ప్రభుత్వం సిఆర్డిఏ లోనే పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని నాడు తాము ఆకాంక్షించామని వెల్లడించారు. విశాఖ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రాంతం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు.

వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి కేంద్రీకరణ అంటూ గోరంట్ల ధ్వజం
ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొంటూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై జగన్ సర్కారు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. కొంతకాలం పాటు ముంపు ప్రాంతం అని ప్రచారం చేసిందని, ఆ తర్వాత ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ కొత్త ప్రచారం మొదలు పెట్టిందని మండిపడిన బుచ్చయ్య చౌదరి జగన్ సర్కార్ మళ్లీ సమగ్రంగా వికేంద్రీకరణ బిల్లు సభలోకి తీసుకొస్తామని చేసిన తాజా ప్రకటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయని గుర్తు చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వికేంద్రీకరణ అంటూనే అధివృద్ధి కేంద్రీకరించేందుకు జగన్ సర్కార్ ప్రయత్నాలు సాగిస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. సీఎం జగన్ తన నిర్ణయాలతో ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య విబేధాలు సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు నిపుణుల కమిటీ వేసి మరీ మూడు రాజధానుల చట్టం చేశామని వైసీపీ నేతలు చెప్పారని, కానీ నేడు నిపుణుల కమిటీ సత్తా ఏమిటో బయటపడిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ నిర్ణయాలపై నిప్పులు చెరిగారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications