ఐవైఆర్ వెనుక జగన్ ఉన్నారా?: అందుకే ఇలా రెచ్చిపోయారా?

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలపై ఊహించని విధంగా విమర్శలు చేయడం తెలుగుదేశం పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది.

ఐవైఆర్ ఇలా తీవ్ర స్థాయిలో సీఎం చంద్రబాబు, ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేయడం వెనుక ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐవైఆర్‌కు జగన్ నుంచి హామీ కూడా లభించినట్లు తెలుస్తోందంటున్నారు.

భవిష్యత్‌లో ఆయన రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారణంగానే బాబును ఫేస్‌బుక్‌లో టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఐవైఆర్ తాను రాజకీయాల్లోకి రానని చెబుతున్నప్పటికీ.. ఈ విమర్శలు చేయడం వెనుక అర్థం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

జగన్ పార్టీ ఎమ్మెల్యేలకే పిలుపు

జగన్ పార్టీ ఎమ్మెల్యేలకే పిలుపు

ఇటీవల జరిగిన ఓ సమావేశానికి స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలను పిలవకుండా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. అంతేగాక, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ సమన్వయకర్తలుగా కూడా వైసీపీ నేతలనే నియమించారని సీఎంకు జాబితాతో సహా టీడీపీ నేతలు పంపారు. అంతకముందే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్‌ ఐవైఆర్‌‌కు ఘాటుగా లేఖ రాశారు.

బాలయ్య సినిమానూ టార్గెట్ చేశారు..

బాలయ్య సినిమానూ టార్గెట్ చేశారు..

కాగా, ఐవైఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడమే కాకుండా.. ఇటీవల బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. చరిత్ర వక్రీకరించి తీసిన సినిమాకు పన్ను మినహాయింపులు ఎందుకని ప్రశ్నించారు. బాహుబలి-2 టికెట్ల ధరల పెంపునకు వ్యతిరేకంగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇతరులు ప్రభుత్వానికి వ్యతికంగా చేసిన కామెంట్లను ఆయన షేర్ చేయడం చర్చనీయాంశమైంది.

రవికిరణ్‌కు మద్దతు

రవికిరణ్‌కు మద్దతు

ఇటీవల తెలుగుదేశం పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి వ్యతిరేకంగా పలు పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి అరెస్టైన రవికిరణ్‌కు కూడా ఐవైఆర్ కృష్ణారావు మద్దతు పలికారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెటైర్లు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్టులు చేస్తారా? అంటూ నిలదీశారు. ఇదేమైనా ఫాసిస్టు ప్రభుత్వమా అని ప్రశ్నించారు. అభిప్రాయం తెలిపే హక్కు కూడా లేదా? అంటూ మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యేతో భేటీ

వైసీపీ ఎమ్మెల్యేతో భేటీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రఘుపతితో ఐవైఆర్ కృష్ణారావు భేటీపైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కాకుండా ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబును నిలదీశారు..

చంద్రబాబును నిలదీశారు..

ఐవైఆర్.. చంద్రబాబును నేరుగా టార్గెట్ చేయడంపైనా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబునాయుడు.. కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెడ్డిని కలిస్తే తప్పులేదు కానీ.. తాను స్థానిక ఎమ్మెల్యే రఘుపతిని కలిస్తే తప్పవుతుందా? అని ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేసిన ఆదేశాలు తనకు ఇప్పటి వరకు అందలేదని, అందిన తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు. పథకం ప్రకారమే తనను తొలగించారని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.
ఏం తప్పు చేశానని తనను సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఏం తప్పు చేశానని నన్ను సస్పెండ్ చేశారో అర్థం కావడం లేదు. సీఎం చంద్రబాబుపై ఆ పార్టీ ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, కేశినేని నానిలు ఆరోపణలు చేసినప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంపీలు వచ్చినప్పుడు గంట సేపైనా విమానాశ్రయాల్లో విమానాలు ఆగాల్సిందేనని ఓ వ్యక్తి పోస్టు పెడితే.. దానికి కౌంటర్ గా తాను పోస్టు పెట్టానని తెలిపారు. మీకు బుద్ధి ఉందా? అని అతడిపై మండిపడినట్లు చెప్పారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిలే జాతీయ నేతలమని చెప్పుకునే వారు కూడా వ్యవహరించడం సరికాదన్నారు. తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే ఉద్దేశమే లేదని కృష్ణారావు స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP leaders fired at Former CS IYR Krishna Rao for his comments on AP CM Chandrababu Naidu.
Please Wait while comments are loading...