Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సభలో చంద్రబాబుపై అభాండాలు.. జగన్ వెకిలి నవ్వులు, సంస్కారం ఇదేనా: భగ్గుమన్న టీడీపీ నేతలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో బోరున విలపించిన విషయం తెలిసిందే. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా అవమానాలు ఎదుర్కొన్నానని, రెండున్నర సంవత్సరాలుగా ఎన్నో అవమానాలను భరిస్తూనే ఉన్నానని బూతులు తిట్టినా సహించానని పేర్కొన్న చంద్రబాబు, తన భార్యను రాజకీయాలలోకి లాగి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 చంద్రబాబుకు అవమానం ... వైసీపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీడీపీ నేతలు

చంద్రబాబుకు అవమానం ... వైసీపీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన టీడీపీ నేతలు

చంద్రబాబు ఎన్నో ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఆయన కన్నీరు పెట్టిన చరిత్ర లేదు. అలాంటిది ఏపీలో ప్రస్తుత వైసీపీ పాలన చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్వడం తెలుగుదేశం పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తుంది. అరాచక పాలన సాగిస్తున్న వైసిపికి చరమగీతం పాడాలని, అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని దారుణంగా టార్గెట్ చేస్తున్న వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులకు బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు . ఇక చంద్రబాబుకి జరిగిన అవమానం పట్ల మండిపడుతున్న టిడిపి నేతలు హనుమాన్ జంక్షన్ వద్ద వైసీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

 వైసిపి అరాచక పాలన కు ముగింపు పలకాలని టీడీపీ శ్రేణుల పిలుపు

వైసిపి అరాచక పాలన కు ముగింపు పలకాలని టీడీపీ శ్రేణుల పిలుపు

రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ జంక్షన్ కూడలి లో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైసిపి అరాచక పాలన కు ముగింపు పలకాలని టీడీపీ శ్రేణులు ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏనాడు కంటతడి పెట్ట లేదని, అలాంటి చంద్రబాబును బాధపెట్టారని మంత్రి పదవుల కోసం, ముఖ్యమంత్రి మెప్పు కోసం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తహతహలాడుతున్నారని అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు.

వివేకానంద రెడ్డి హత్య గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయంతో ఇలా : పరిటాల సునీత

వివేకానంద రెడ్డి హత్య గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయంతో ఇలా : పరిటాల సునీత

ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం పై మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పై అభాండాలు వేస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు అని పరిటాల సునీత మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండే సంస్కారం ఇదేనా అంటూ ప్రశ్నించిన పరిటాల సునీత వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఏ ఒక్కరికీ లేదని ఆమె తేల్చి చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయంతో ఈ విధంగా మాట్లాడారని పరిటాల సునీత అభిప్రాయపడ్డారు.

పిచ్చి కుక్కల కంటే హీనంగా వైసీపీ నేతల వ్యాఖ్యలు : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

పిచ్చి కుక్కల కంటే హీనంగా వైసీపీ నేతల వ్యాఖ్యలు : మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

వైసిపి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు అమానుషమని విరుచుకుపడ్డారు ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించేలా ఉందని టీడీపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని, అంబటి రాంబాబు ల పరిస్థితి ఏమిటని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. పిచ్చి కుక్కల కంటే హీనంగా వైసిపి నాయకులు మాట్లాడారని, కొడాలి నాని సంస్కారహీనుడు అని లుచ్చా రాజకీయం చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు మాట్లాడిన వారిని బజారులో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు అంటూ శ్రీనివాసులు తేల్చిచెప్పారు. వైసిపి మంత్రుల బతుకులు ముందు ముందు ఎంత దుర్భరంగా ఉంటాయో ప్రజలు చూస్తారని కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నాని, 'కాం'బాబుల‌కు కౌర‌వుల గ‌తే ప‌డుతుంది: యరపతినేని శ్రీనివాసరావు

నాని, 'కాం'బాబుల‌కు కౌర‌వుల గ‌తే ప‌డుతుంది: యరపతినేని శ్రీనివాసరావు

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని కష్టాలు వచ్చినా నిగ్రహం కోల్పో లేదని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం పైన, కుటుంబ సభ్యుల పైన అభాండాలు వేస్తే సహించేది లేదని టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తేల్చిచెప్పారు. ఎన్టీఆర్‌ బిడ్డ‌పై నింద‌లేసిన నాని, 'కాం'బాబుల‌కు కౌర‌వుల గ‌తే ప‌డుతుంది అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో మహిళతో రాసలీలలు చేసే అంబటి రాంబాబు కూడా చంద్రబాబు గురించి మాట్లాడతాడా అంటూ మండిపడ్డారు. అంబటి రాంబాబు ఒక వెధవని, ఓ ఊరకుక్కని మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+