టీడీపీ రాజకీయానికి జనసేన విలవిల - ఆ సీట్లు వదులుకోవాల్సిందేనా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తుతో అధికారంలోకి ఖాయమనే ఆ రెండు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు. సీట్ల విషయంలోనూ రెండు పార్టీల ముఖ్య నేతలు అదే ధీమాతో కనిపిస్తున్నారు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యలకు కారణమవుతోంది. జనసేన ముఖ్య నేతలకు కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది పవన్ పార్టీ నేతలకు అంతు చిక్కటం లేదు. దీంతో, ఇప్పుడు ఈ సీట్ల పైన కొత్త పంచాయితీ మొదలైంది.
సీట్ల పంచాయితీ
ఏపీలో జగన్ ను గద్దె దింపటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. తమతో బీజేపీ కలిసి రావాలని పిలుపునిస్తున్నాయి. ఈ సమయంలో జనసేనకు ఇచ్చే సీట్ల పైన ఇప్పటికే ప్రాధమికంగా చర్చలు జరిగాయి. జనసేనకు పట్టున్న గోదావరి జిల్లాలతో పాటుగా, ముఖ్య నేతల నియోజవర్గాలను తమకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. జనసేనకు 22-25 సీట్లు ఇచ్చేందుకు ప్రాధమికంగా నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. అందులో ముఖ్య నేతలుగా ఉన్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పంతం నానాజీ, ముత్తా శశిధర్, పోతిన మహేష్, గుణ్ణం నాగబాబు,బొమ్మిడి నాయక్ వంటి వారు ఉన్నారు. అయితే, అనూహ్యంగా జనసేన తమకు ఖాయమని భావిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కొత్త రాజకీయం ప్రారంభించారు.

సీట్లు ఉన్నట్లా లేనట్లా
పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. మనోహర్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన ఆలపాటి రాజా సైతం ఒక సందర్భంలో తనకు సీటు లేదనే విధంగా వ్యాఖ్యలు చేసారు. కానీ, ఇప్పుడు అదే తెనాలి నుంచి రాజా పాదయాత్ర ప్రారంభించారు. పార్టీల నాయకత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటామని చెబుతూనే పాదయాత్ర చేయటం జనసేన నేతలకు అంతు చిక్కటం లేదు. మనోహర్ సీటు పైన ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. అదే విధంగా రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సీటు జనసేన కు కేటాయిస్తారని చెబుతున్నారు.
పవన్ తేల్చేస్తారా
దీని పైన టీడీపీలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. కానీ, బుచ్చయ్య చౌదరి తానే వచ్చే ఎన్నికల్లో అభ్యర్దిగా ఉంటానని ప్రచారం ప్రారంభించారు. పాలకొల్లు సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడుకు టీడీపీ ఖరారు చేసింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కానీ, అక్కడ జనసేన కార్యాచరణ ప్రారంభించింది. దీంతో, టీడీపీ నేతల తీరు జనసేన నేతలు నేరుగా పార్టీ అధినేత పవన్ తో చర్చించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ పూర్తిగా టీడీపీకి సహకరించాలనే కేడర్ కు సూచించటం..సీట్ల గురించి తేల్చకపోవటం కూడా ఈ పరిస్థితి కారణంగా పార్టీలో నేతల మధ్య చర్చగా మారుతోంది. దీంతో..ఇప్పుడు ఈ సీట్ల పంచాయితీకి ఎలాంటి ముగింపు ఇస్తారనేది చూడాలి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications