వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్యకు షాక్ :హిందూపురంలో పోటాపోటీ ర్యాలీలు,తమ్ముళ్ళ పయనమెటు?

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టిడిపి నాయకులు బాలకృష్ణ పి.ఎ. శేఖర్ కువ్యతిరేకంగా , అనుకూలంగా ర్యాలీలు నిర్వహించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హిందూపురం:అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ పి.ఎ.శేఖర్ ను సమర్థించే వర్గం, శేఖర్ ను వ్యతిరేకించే వర్గంగా టిడిపి నాయకులు విడిపోయారు. పోటాపోటీగా పార్టీలోని రెండు గ్రూపుల తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి బాలకృష్ణ పోటీచేసి విజయం సాధించారు.

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలతో పాటు, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను బాలయ్య తరపున ఆయన పి.ఎ. శేఖర్ చూస్తుంటాడు.

అయితే బాలకృష్ణ పిఎ శేఖర్ వ్యవహరశైలిపై కొందరు నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.శేఖర్ కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.అయితే ఈ ప్రమాదాన్ని గ్రహించిన శేఖర్ కూడ తనకు మద్దతుగా నిలిచే వారితో ర్యాలీలు నిర్వహించారు.

 శేఖర్ పై అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్న నేతలు

శేఖర్ పై అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్న నేతలు

గత ఎన్నికల్లో హిందూపురం ఎంఏల్ఏగా బాలకృష్ణ విజయం సాధించారు.సినిమా నటుడిగా ఉన్నందున ఆయన నియోజకవర్గానికి అప్పుడప్పుడూ మాత్రమే వస్తుంటారు.అయితే నియోజకవర్గంలో పనులన్నింటిని చక్కబెట్టేందుకు తన వ్యక్తిగత సహయకుడు (పి.ఎ) శేఖర్ ను బాలయ్య నియమించాడు. అయితే శేఖర్ వ్యవహరశైలిని కొందరు నాయకులు తప్పుబడుతున్నారు. ఆయన తీరుతో అసంతృప్తికి గురయ్యారు.శేఖర్ పై బాలకృష్ణకు ఫిర్యాదు చేసేందుకు కూడ సిద్దమయ్యారు. శేఖర్ పై అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్న నాయకులంతా మాజీ ఎంఏల్ఏ వెంకట్రాముడు నేతృత్వంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

 రెండు గ్రూపులుగా చీలిన పార్టీ నాయకులు

రెండు గ్రూపులుగా చీలిన పార్టీ నాయకులు

బాలకృష్ణ పిఎ శేఖర్ ను సమర్థించే వర్గం, వ్యతిరేకించే వర్గంగా హిందూపరం లో టిడిపి నాయకులు మారిపోయారు.అయితే శేఖర్ వ్యవహరశైలిని వ్యతిరేకించే నాయకులు తీవ్రంగా ఆయనను హిందూపురం నుండి సాగనంపేందుకు పావులు కదుపుతున్నారు. మాజీ ఎంఏల్ఏ వెంకట్రాముడు, అంబికా లక్ష్మీనారాయణ లాంటి నేతలంతా పి.ఎ. శేఖర్ కువ్యతిరేకంగా ఉన్నారు.అయితే శేఖర్ వ్యవహరశైలిని సమర్థించేవారు కూడ ఉన్నారు.అయితే వారి సంఖ్య నామమాత్రమేనని శేఖర్ వ్యతిరేక వర్గీయులు చెబుతున్నారు.

పోటాపోటీ ర్యాలీలు చేసిన రెండు గ్రూపులు

పోటాపోటీ ర్యాలీలు చేసిన రెండు గ్రూపులు

భాలకృష్ణ పి.ఎ. శేఖర్ ను సమర్థించే, వ్యతిరేకించే వర్గాలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. పి.ఎ. శేఖర్ వ్యవహరశైలిని నిరసిస్తూ చిలమత్తూరు, లేపాక్షి జడ్ పి టి సి సభ్యులు లక్ష్మీనారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డిలు తమ పదవులకు రాజీనామాలు చేశవారు. పార్టీలో ఎందుకు ఉండాలని వారు ప్రశ్నించారు.ఈ మేరకు ఆదివారం నాడు సభ నిర్వహిస్తామని వారు ప్రకటించారు.అయితే లేపాక్షిలో శేఖర్ వర్గీయులు ర్యాలీ నిర్వహించారు.అయితే ఈ ర్యాలీకి మాత్రం తక్కువమంది హజరయ్యారు.

 నందమూరి కుటుంబానికి వ్యతిరేకం కాదు

నందమూరి కుటుంబానికి వ్యతిరేకం కాదు

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సినీ నటుడు బాలకృష్ణకు తాము వ్యతిరేకం కాదని, నందమూరి కుటుంబానికి, పార్టీకి కూడ వ్యతిరేకంగా పనిచేయడం లేదని అసమ్మతి నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో పి.ఎ. శేఖర్ వ్యవహరిస్తున్న తీరునే తాము తప్పుబడుతున్నామని వారు చెప్పారు.శేఖర్ వ్యవహరిస్తున్న తీరు వల్లే పార్టీకి నష్టం వాటిల్లుతోందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

 రాజీ యత్నాలు బెడిసికొట్టాయి

రాజీ యత్నాలు బెడిసికొట్టాయి

ఆదివారం నాడు ఎలాంటి సభలు నిర్వహించకూడదని కొందరు పార్టీ నాయకులు అసమ్మతి నాయకులతో సంప్రదింపులు జరిపారు.అయితే ఈ సంప్రదింపులు జరుగుతున్న సమయంలోనే లేపాక్షి మండల కేంద్రంలో శేఖర్ మద్దతుదారులు ఆయనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిర్వహించడం పట్ల అసమ్మతి నాయకులు తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు.ఎంఏల్ఏ దూతలుగా కొందరు వ్యక్తులు అసమ్మతి నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

 బాలకృఫ్ణ ఎటు వైపు

బాలకృఫ్ణ ఎటు వైపు

తన పి.ఎ. శేఖర్ వైఖరిని టిడిపి నాయకులు తప్పుబడుతున్నారు.అయితే పి.ఎ. శేఖర్ వ్యవహరశైలిని కొందరు మాత్రమే సమర్థిస్తున్నారు.అయితే బాలకృష్ణ తన పి.ఎ. శేఖర్ ను సమర్థిస్తారా, పార్టీ నాయకుల వైపు నిలుస్తారా అనేది ఉత్కంఠగా మారింది. అయితే పి.ఎ. శేఖర్ చెప్పినట్టుగా బాలకృష్ణ నడుచుకొంటాడనే ప్రచారం కూడ ఉంది.అయితే శేఖర్ పై మెజార్టీ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.అయితే బాలయ్య ఎవరికీ అండగా ఉంటారో చూడాలి.మరో వైపు శనివారం రాత్రి అసమ్మతి నాయకులతో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాస్ లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బికె పార్థసారథిలు చర్చించారు. కాని, అసంతృప్తి నేతలు మాత్రం వెనక్కి తగ్గలేదు.

English summary
tdp leaders rally against balakrishna p.a. shekar in hindpur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X