మావోయిస్టుల చెర నుంచి టిడిపి నేతల విడుదల
విశాఖపట్నం0: ఏజెన్సీలో కిడ్నాపైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. గురువారం ఉదయం ఒడిశాలోని చిత్రకొండ అటవీప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు గిరిజన ఉద్యోగ సంఘాల నేతలకు టిడిపి నేతలను అప్పగించారు.
టిడిపి నేతలు పదిరోజుల పాటు మావోయిస్టుల చెరలో ఉన్నారు. వారిని నేతలను విడుదల చేయడంతో విశాఖ ఏజెన్సీలో ఉత్కంఠ పరిస్థితికి తెరపడింది. టిడిపి నేతలను తీసుకుని గిరిజన సంఘాల నేతలు సీలేరు మీదగా స్వస్థలాలకు బయలుదేరారు.

బాక్సైట్ తవ్వకాలకు మద్దతు ఇవ్వబోమని టిడిపి నేతలతో ప్రమాణం చేయించిన తర్వాతనే మావోయిస్టులు వారిని వదిలిపెట్టినట్లు సమాచారం. పది రోజుల క్రితం విశాఖపట్నం జిల్లా టిడిపి కార్యదర్శి ముక్కల మహేష్, గూడెం కొత్తవీధి మండలం అధ్యక్షుడు ఎం. బాలయ్య పడాలు, ఉపాధ్యక్షుడు వి. బాలయ్యలను మావోయిస్టులు అపహరించారు.












Click it and Unblock the Notifications